బాహుబలికి నేషనల్ అవార్డుల పంట

National awards to bahubali and ghazi
Highlights

బాహుబలికి నేషనల్ అవార్డుల పంట

జాతీయ స్థాయిలో సినిమా అవార్డులను ఈ రోజు ప్రకటించారు. 65వ జాతీయ చలన చిత్రం అవార్డుల్లో... శ్రీదేవి నటించిన మామ్‌ సినిమాతో పాటు టాలీవుడ్ విజువల్‌ వండర్‌ బాహుబలి2 సినిమాలకు అవార్డుల పంట పండింది. ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి 2 కు మూడు అవార్డులు లభించాయి. రానా నటించిన ఘాజీ చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో మొదటిసారిగా సబ్‌ మెరైన్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనే కాక ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ స్థాయిలో ఎంపికైంది.

ఉత్తమ నటి: శ్రీదేవి (మామ్‌)
ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్
ఉత్తమ మలయాళీ చిత్రం: టేకాఫ్
ఉత్తమ తమిళ చిత్రం: టు లెట్‌
ఉత్తమ మరాఠీ చిత్రం: కచ్చా నింబూ
ఉత్తమ కన్నడ చిత్రం: హెబ్బెట్టు రామక్క
ఉత్తమ బెంగాలీ చిత్రం: మయురాక్షి
ఉత్తమ యాక్షన్‌ చిత్రం: బాహుబలి-2
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్‌ రెహమాన్‌ (మామ్‌), (కాట్రు వెలియిదాయ్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా)
ఉత్తమ దర్శకుడు: జయరాజ్‌ (మలయాళ చిత్రం భయానకం)
ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నాకు దాదాసాహెబ్‌ ఫాల్కే 

loader