బాలయ్య 102వ చిత్రంలో మళయాళ భామ నటాషా ఇప్పటికే ఒక హీరోయినగా నయనతార ఎంపిక నటాషా, బాలయ్య మధ్య కీలక సన్నివేషాల చిత్రీకరణ
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని మళయాళ భామలు ఏలేస్తున్నారు. ఇప్పటికే కీర్తీ సురేష్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వర లాంటి కొత్త భామలో టాలీవుడ్ లో సత్తా చాటుతుండగా.. మరో మళయాళ భామ తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది. అది కూడా నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాతో పరిచయం కాబోతోంది.
బాలకృష్ణ నటించిన 101వ చిత్రం ‘పైసా వసూల్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా బాగానే రాణిస్తోందంటున్నారు సినీ విశ్లేషకులు. బాలయ్య తన తదుపరి చిత్రం కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంటుందనేది టాలీవుడ్ టాక్.
ఇప్పటికే ఈ సినిమాలో నయనతారను ఒక హీరోయిన్ గా ఎంపిక చేయగా.. ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. అయితే మరో హీరోయిన్ గా మళయాళ బామను ఎంపిక చేశారు. మళయాళంలో విజయవంతమైన మంతిరన్, హైడ్ అండ్ సీక్ సినిమాల ఫేం నటాషా దోషి ఈ చిత్రంలో రెండో హీరోయినగా నటిస్తున్నారు.
ఇప్పటికే బాలయ్య, నటాషాల మధ్య సీన్లు చిత్రీకరణ ప్రారంభించేసారట. వీరితోపాటు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, జయ ప్రకాశ్ రెడ్డి లు కూడా షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ చిత్రంలో నటాషా పాత్ర చాలా కీలకమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ తో సినిమా చేస్తున్నందుకు నటాషా చాలా థ్రిల్లింగ్ గా ఫీలవుతున్నారట.
ఈ చిత్రాన్ని సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథ మాటలు ఎం.రత్నం అందిస్తున్నారు.
