ప్రస్తుతం నామినేషన్లలో లోబో, సిరి, ఆనీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా  ఓ లీక్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

బిగ్‌బాస్‌ 5 నాల్గో వారం ముగింపు దశకు చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌లో ప్రియా, కాజల్‌, సన్నీ, యాంకర్‌ రవిలు సేవ్‌ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగే ఎలిమినేషన్‌ ప్రక్రియలు ఈ నలుగురు సేవ్‌ అయ్యారు. ప్రస్తుతం నామినేషన్లలో లోబో, సిరి, ఆనీ మాస్టర్‌, నటరాజ్‌ మాస్టర్‌ ఉన్నారు. వీరిలో ఎవరు ఆదివారం ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ లీక్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇందులో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది మేల్ కంటెస్టెంట్‌ అని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రెండో వారంలోనే నటరాజ్‌ మాస్టర్‌ చివరి వరకు వెళ్లి తిరిగి వచ్చారు. దీంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత దూరం వచ్చి, తన భార్య ఎంతో ప్రేమతో పంపిస్తే ఏం చేయకుండా వెళ్తే వేస్ట్ అని ఆయన ఎమోషనల్‌ అయ్యారు. 

కానీ నాల్గో వారంలోనే ఆయన ఎలిమినేట్‌ అవుతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మిగిలిన వారితో పోల్చితే ఆయనకు బాగా తక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. ఈ వారం నటరాజ్‌ పర్‌ఫెర్మెన్స్ బాగా లేదనే టాక్‌ కూడా ఉంది. ఆయన అతి చేస్తున్నారని, కొన్ని సార్లు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదనే కామెంట్లు వస్తున్నాయి. అంతేకాదు ఆయనపై విపరీతమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.