Asianet News TeluguAsianet News Telugu

‘‘మ్యాడ్‌’’ ఏ OTT లో..ఎప్పటి నుంచి?

 ‘మ్యాడ్‌’  సినిమా ద్వారా జూనియర్‌ ఎన్టీయార్‌ బావమరిది నార్నె నితిన్‌ (Narne nithin)హీరోగా పరిచయం అయ్యాడు. అతనితోపాటు సంగీత్‌ శోభన్‌, రామ్‌నితిన్‌, గౌరిప్రియ, అనంతిక, గోపిక తదితర యువతారలు ఇందులో నటించారు.

Narne Nithin, Sangeeth Shoban starrer MAD OTT release date jsp
Author
First Published Oct 7, 2023, 10:40 AM IST


తెలుగులో భారీ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ మధ్య మధ్యలో కంటెంట్ ఉన్న  చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో  ఈ బ్యానర్ లో యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ మూవీ నిన్న శుక్రవారం రిలీజై ఫన్ రైడ్ గా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఏ ప్లాట్ ఫామ్ లో ..ఎప్పటి నుంచి అనేది హాట్ టాపిక్ గా మారింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు   Netflix వారు తీసుకున్నారు. ఆ రేటుతో ఈ లో బడ్జెట్ సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం వచ్చేసి లాభాల్లో పడ్డారని తెలుస్తోంది. ఇక థియేటర్ రెవిన్యూ ఎంత వచ్చినా అది లాభం క్రిందే లెక్క అని అంటున్నారు.  అలాగే ఈ సినిమా నవంబర్ 2023 మొదటి వారంలో ఓటిటిలోకి వచ్చే అవకాసం ఉంది. దుల్కర్ , విశ్వక్సేన్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
   
స్టోరీ లైన్  : 

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్), డీడీ  (సంగీత్ శోభన్). మొదటి రోజడు నుంచే  వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు.  వీరితో పాటుగా లడ్డు అనే కుర్రాడు కూడా కలిసి తిరుగుతూంటాడు. అశోక్  ఇంట్రావర్ట్ ఉంటూంటాడు! అశోక్ ని  జెన్నీ (అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్ కూడా మనస్సులో  జెన్నీని ఇష్టడుతుంటాడు. కానీ ఒకరికొకరు చెప్పుకోరు. అదో లవ్ స్టోరీ. మరో ప్రక్క  మనోజ్ కనిపించిన ప్రతీ అమ్మాయిని  ఫ్లర్ట్ చేస్తూంటాడు. ఇలాంటి పులిహార కుర్రాడికి ... శృతి (శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)కనపడ్డాక నిజంగానే ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంతో ఆమె అతన్ని దూరం పెట్టి యుఎస్ వెళ్లిపోతుంది. 

 ఇక డీడీ ది మరో టైప్ .  తనకు అమ్మాయిలు ఏ అమ్మాయిలు పడరు అని దూరంగా ఉంటూంటాడు.సింగిల్ లైఫే సో బెటర్ అని పాటలు పాడుతూంటాడు.  అతనికి  ఓ అజ్ఞాత ప్రేమికురాలు లాంటి ఓ అమ్మాయి లవ్ లెటర్ రాస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరో రివీల్ కాదు. దాంతో ఆ అమ్మాయి ఎవరా అని వెతుకుతూంటాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి అనేది ఓ షాక్ అయ్యే ట్విస్ట్ తో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి...అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా... మరో ప్రక్క మనోజ్ ప్రేమ కథలో అపార్దాలు తొలిగాయా...ఈ కథలో రాధ (గోపికా ఉదయన్) క్యారక్టర్ ఏమిటి...  అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios