ప్రస్తుతం కరోనా కారణంగా సెలబ్రిటీ ఆరోగ్య మీద దృష్టి పెట్టారు. ఇమ్యూనిటీ పెంచుకోవటంతో పాటు ఇతర చికిత్సల మీద కూడా దృష్టి పెడుతున్నారు. తాజాగా హాట్ బ్యూటీ నర్గీస్‌ ఫక్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఆసక్తికర ఫోటోలను షేర్ చేసింది. కాలిఫోర్నియాలో డిటాక్సింగ్‌ కోసం మడ్‌ బాత్‌ చేయించుకున్న ఫోటోలను షేర్ చేసింది నర్గీస్‌ ఫక్రీ.

పర్పుల్‌ బికినీలో ఎర్ర మట్టిని వంటికి పట్టించుకొని ఎండకు ఉన్న నర్గీస్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. `క్రమం తప్పకుండా మీ జీవితాలను డిటాక్స్  చేసుకోండి. పాతను బయటకు పంపి, కొత్తకు స్వాగం పలకండి అంటూ పోస్ట్ చేసింది నర్గీస్‌ ఫక్రీ. కాలిఫోర్నియా స్పాలో మడ్‌ బాత్‌ చేయించుకున్న నర్గీస్‌ తన అనుభావాలను షేర్‌ చేసుకుంది.

మడ్‌ బాత్‌  ఫోటోలకు పోస్ట్ చేయటానికి ముందు తాను బ్రేక్ తీసుకుంటున్నట్టుగా మరో పోస్ట్ ను షేర్ చేసింది నర్గీస్‌. `జీవితం చాలా చిన్నది దాన్ని ఇబ్బందికరం చేసుకోకండి. కొన్ని సార్లు అతి ఆలోచించటాన్ని పక్కన పెట్టి సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్లాలి. జస్ట్ లిక్స్‌ అయి కొత్త పనులు ప్రారంభించండి` అంటూ కామెంట్ చేసింది నర్గీస్‌.