బాలీవుడ్ లో 'రాక్ స్టార్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నర్గీస్ ఫక్రీ.. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఈ మధ్య కాలంలో అవకాశాలు బాగా తగ్గాయి. ఇది ఇలా ఉండగా.. ఈ మధ్య నర్గీస్ ఎక్కువగా లూజ్ గా ఉండే బట్టలు ధరిస్తోంది.

దీంతో ఆమె గర్భవతి అనీ బయటకి వచ్చేసమయంలో ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆమె వదులుగా ఉండే వస్త్రాలను ధరిస్తోందని బాలీవుడ్ మీడియా కొన్ని కథనాలను ప్రచురించింది.

ఈ వార్తలు నర్గీస్ వరకు వెళ్లడంతో ఆమె మండిపడింది. ఈ వార్తలు అవాస్తవమని నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని సూచించింది. చాలాకాలం పాటు నర్గీస్ ఓ ఫ్రెంచ్ మోడల్ తో డేటింగ్ చేసింది. అతడి కారణంగా ఆమె గర్భవతి అయిందంటూ మీడియా రాసింది. కానీ ఇప్పుడు ఆమె అతడికి దూరంగా ఉంటోంది.

ఆ కారణంగా గర్భవతి వార్తలపై మరింత అసహనాన్ని వ్యక్తం చేసింది. తనకు స్కిన్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయని ఆ కారణంగానే వదులుగా ఉండే బట్టలను ధరిస్తున్నట్లు వెల్లడించింది. అసలే అవకాశాలు రాక కెరీర్ ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి కథనాలు వినని అమ్మడు తట్టుకోలేకపోయింది.