సౌత్ లో సంచలనం సృష్టించిన లవ్ బర్డ్స్ నరేష్, పవిత్ర. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు, వ్యక్తిగత వివాదాలు సహజమే. కానీ వీళ్లిద్దరి వ్యవహారం వేరు. 60 ప్లస్ లో ఉన్న నరేష్.. 40 ప్లస్ లో ఉన్న పవిత్ర మధ్య ఘాటు ఎఫైర్ మొదలయింది.
సౌత్ లో సంచలనం సృష్టించిన లవ్ బర్డ్స్ నరేష్, పవిత్ర. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ప్రేమ కథలు, వ్యక్తిగత వివాదాలు సహజమే. కానీ వీళ్లిద్దరి వ్యవహారం వేరు. 60 ప్లస్ లో ఉన్న నరేష్.. 40 ప్లస్ లో ఉన్న పవిత్ర మధ్య ఘాటు ఎఫైర్ మొదలయింది. ఆ తర్వాత నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి మధ్య ఎలాంటి వివాదం చెలరేగిందో అంతా చూశారు. ప్రస్తుతం నరేష్, పవిత్ర పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.
తన లైఫ్ లో రమ్య రఘుపతి, పవిత్రలతో జరిగిన సంఘటనల ఆధారంగా నరేష్ మళ్ళీ పెళ్లి అనే చిత్రంలో నటించారు. పవిత్ర నరేష్ కి జోడిగా నటించింది. లిప్ కిస్సులు, రియల్ లైఫ్ వివాదాలతో రిలీజ్ కి ముందు ఈ చిత్రం పెద్ద హంగామా సృష్టించింది. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని ఇటీవల మే 26న రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.
రిలీజైన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువస్తున్నారు.ఓటీటీలోఈ చిత్రం ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా సంస్థలు మళ్ళీ పెళ్లి చిత్రాన్ని ఒకేరోజు స్ట్రీమింగ్ చేయబోతున్నాయి. ఈ రెండు ఓటీటీల్లో మళ్ళీ పెళ్లి చిత్రం జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
దీనితో మళ్ళీ పెళ్లి చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్స్ లో ఈ చిత్రం హిట్ కానప్పటికీ ఓటిటి రిలీజ్ కి మాత్రం మంచి బజ్ ఉంది. ఈ చిత్రంలో నరేష్ నరేంద్ర గా, పవిత్ర పార్వతిగా నటించారు. నరేష్, పవిత్ర లవ్ ఎఫైర్.. నరేష్ లైఫ్ లో కాంట్రవర్సీల వల్లే మళ్ళీ పెళ్లి చిత్రానికి ఇంత క్రేజ్ వచ్చిందనేది నెటిజన్ల అభిప్రాయం.
