అపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు నారా రోహిత్. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఈ హీరో బాట మాత్రం అస్సలు మారడం లేదు. ఎలాగైనా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని గత కొంత కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ఇక చాలా కాలం తరువాత తన మొదటి సినిమా బాణం ర్శకుడు చైతన్య దంతులూరితో కలవనున్నాడు రోహిత్. ఒక పీరియడ్ డ్రామా తరహాలో వీరి సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త గెటప్ లో రోహిత్ కనిపిస్తాడట. ప్రతి సినిమాలో రోహిత్ ఒకేలా కనిపిస్తున్నాడని వస్తున్న కామెంట్స్ కు ఈ సినిమా ద్వారా సమాధానం చెప్పనున్నాడట. 

సినిమా మొత్తం 1970 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని సమాచారం. ఇప్పటికే సినిమా సెట్స్ కి సంబందించిన ప్లాన్స్ కూడా ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ నారా రోహిత్ ప్లాన్ వేస్తున్నాడు. ముందుగా జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకున్నారు. ఇక ఇప్పుడు డిసెంబర్ లోనే మొదలెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.