తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు తిరుపతిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చకు దారితీశాయి.

తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు తిరుపతిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చకు దారితీశాయి. నారా లోకేష్ తిరుపతిలో యువతతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్.. సినీ సెలెబ్రిటీల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నేను కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానినే అన్నారు. రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం చూశా అని అన్నారు. ఇక మా బాల మామ గురించి చెప్పాలంటే.. ఆయన నాకు ముద్దుల మావయ్య. ఆయన సినిమాలు ఫస్ట్ రోజే చూస్తాను అని చెప్పారు. 

జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా యువత నారా లోకేష్ ని అడిగారు. దీనికి లోకేష్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. జూ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా అని అడుగుతున్నారు.. నూటికి నూరు శాతం.. ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి.. ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలి అని మంచి మనసుతో కోరుకుంటారో వాళ్ళందరిని నేను ఆహ్వానిస్తాను. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మాత్రమే కలిశాను అది కూడా 2014లో. ఆయనలో మంచి మనసు చూశాను అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రత్యేకంగా జూ. ఎన్టీఆర్ గురించి లోకేష్ ఎలాంటి కామెంట్ చేయలేదు. 

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల రిలీజ్ ముందు కూడా నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల పేరుతో కొందరు వైసిపి బ్యాచ్ క్యాస్ట్ వార్ పెట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి వలలో చిక్కుకోవద్దు అని ఆ టైంలో నారా లోకేష్ హెచ్చరించాడు కూడా.