Asianet News TeluguAsianet News Telugu

డైరక్టర్ మారుతి నెక్ట్స్ హీరో ఖరారు

సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు. గత కొద్ది రోజులుగా మారుతి ఏ హీరోకు సినిమా చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

Nani will give dates to Maruthi next movie?
Author
Hyderabad, First Published Aug 3, 2020, 5:42 PM IST

ఈ రోజుల్లో అనే సినిమా మారుతికు డైరక్టర్ గా కెరీర్  ఇస్తే..శైలజా రెడ్డి అనే సినిమా ఆయనకు గ్యాప్ తెచ్చేసింది. అయితే ఆ తర్వాత కసితో సాయి ధరమ్ తేజతో చేసిన ప్రతీ రోజూ పండుగే చిత్రం మారుతిని తిరిగి ఫామ్ లోకి తెచ్చేసింది. అయితే ఆయన నెక్ట్స్ సినిమా మాత్రం ఇన్నాళ్లూ ఖరారు కాలేదు. గత కొద్ది రోజులుగా మారుతి ఏ హీరోకు సినిమా చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా షూటింగ్ కరోనా వల్ల మొదలెట్టకపోయినా సినిమా ఎనౌన్సమెంట్ కూడా చేయలేదు. అయితే తాజాగా ఆయన ఓ హీరో ని ఒప్పించి సినిమా ఫైనల్ చేసుకున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు నాని.

నాని, డైరక్టర్ మారుతి కాంబినేషన్ లో గతంలో ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ హిట్ వచ్చింది. ఆ తర్వాత మారుతి, నాని కలిసి ఇంకో సినిమా చేస్తారని  భావించారు. మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు బిజీ అవ్వటంతో .. ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. 

అయితే  అందుతున్న సమాచారం మేరకు వీరి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కబోతోంది. రీసెంట్ గా మారుతి, నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేసి వినిపించిన్నట్లు తెలుస్తోంది. భలే భలే మొగాడివోయ్ సినిమాని మించి ఫన్ ఈ సినిమాలో ఉండబోతోందిట.   ప్రస్తుతం ‘వి’ చిత్రం చేస్తున్న నాని త్వరలో ‘టక్ జగదీష్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios