Keerthy Suresh:నాని భార్యని సర్ప్రైజ్ చేసిన కీర్తి సురేష్..వైరల్ పిక్, 'దసరా' బుల్లోడితో నైట్ పార్టీనా ?

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్ళిద్దరూ నేను లోకల్ లాంటి హిట్ మూవీలో నటించారు. మరోసారి జంటగా ఈ ఏడాది దసరా చిత్రంలో నటించారు. 

Nani wife Anjana birthday celebrations with keerthy suresh dtr

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్ళిద్దరూ నేను లోకల్ లాంటి హిట్ మూవీలో నటించారు. మరోసారి జంటగా ఈ ఏడాది దసరా చిత్రంలో నటించారు. నాని ఫస్ట్ టైం ఊర మాస్ గెటప్ లో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

దీనితో కీర్తి సురేష్ కి నాని ఫ్యామిలీతో పర్సనల్ బాండింగ్ ఏర్పడింది. కీర్తి సురేష్ తరచుగా నాని ఫ్యామిలీతో ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇక నాని సతీమణి అంజనా భలే యాక్టివ్ గా ఉంటారు. ఆమె డాన్స్ రీల్స్ కూడా వైరల్ అవుతుంటాయి. 

సోషల్ మీడియాలో అంజనా తరచుగా ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా కీర్తి సురేష్ అంజనాని సర్ప్రైజ్ చేసింది. నేడు నాని భార్య అంజనా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది. 

Nani wife Anjana birthday celebrations with keerthy suresh dtr

నాని, అంజనాతో కలసి నైట్ పార్టీలో ఉన్న దృశ్యాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకుంది. 'నా కర్లీ హెయిర్ పార్ట్నర్ అంజుకి హ్యాపీ బర్త్ డే. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. నీ భర్త నాని లేకుండా మనం కొన్ని ఫొటోస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం అంటూ ఫన్నీ పోస్ట్ చేసింది. ఈ పిక్ లో ఇద్దరి మధ్యలో నాని ఉన్నాడు. అలాగే అంటే సుందరానికీ హీరోయిన్ నజ్రియా కూడా అంజనాని విష్ చేస్తూ పోస్ట్ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios