గత ఏడాది వరకు బాక్స్ ఆఫీస్ హిట్స్ తో టాలీవుడ్ ని షేక్ చేసిన నాని నిర్మాతగా కూడా మంచి సక్సెస్ ను అందుకున్నాడు. అయితే ఈ ఏడాది వరుస అపజయాలతో నాని కమర్షియల్ హిట్స్ అందుకోలేకపోయారు. ఇక నెక్స్ట్ ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నాడు. 

ఇప్పటికే జెర్సీ సినిమాను సెట్స్ పైకి తెచ్చి సగం షూటింగ్ ఫినిష్ చేసిన నాని అందులో ఒక క్రికెటర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఒక డిఫరెంట్ స్టోరీని ఒకే చేసినట్లు  అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఈ విషయాన్నీ తెలిపాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో సిద్దార్థ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. 

ఇక అమ్మయిల కోసమే ఈ సినిమా అంటూ నాని చెప్పిన విధానం వైరల్ గా మారింది. ఇక సీనియర్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమాకు వర్క్ చేయనున్నారు. ఫిబ్రవరి లో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేశారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.