సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో చేయడం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలనుకున్న సినిమాను యంగ్ హీరో నానితో తీస్తున్నారు దర్శకనిర్మాతలు.

వివరాల్లోకి వెళితే.. నాని హీరోగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ 'గ్యాంగ్ లీడర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఆ విధంగా సినిమా కథ చూచాయిగా బయటకి వచ్చింది. నాని.. నలుగురు మహిళలు, ఓ విలన్ ఉంటారని తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమా కథను మహేష్ బాబు కోసం తయారు చేసుకున్నాడట దర్శకుడు విక్రమ్ కె కుమార్. అప్పట్లో అశ్వనీదత్, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో మహేష్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ చేశారు. చాలా సంప్రదింపుల తరువాత స్క్రిప్ట్ పూర్తయింది. 

కానీ ఆ కథ మహేష్ కి నచ్చలేదు. ఇప్పుడు అదే కథతో నానితో సినిమా తీస్తున్నాడు విక్రమ్. ఈ కారణంగానే అశ్వనీదత్ ఆ మధ్య గొడవ పెడితే అతడికి ఎక్కువ మొత్తంలో కాంపన్సేషన్ చెల్లించారు.