గతంలోలాగ సినిమా రిలీజ్ అయ్యాక చూసి..అరెరే..ఇది ఫలానా హాలీవుడ్ కాపీ కదా అనుకునే రోజులు పోయాయి. సినిమా ప్రారంభం కాకముందే ఆ సినిమా దేని నుంచి ఎత్తుతున్నారో మీడియా, సినిమా జనం చెప్పేస్తున్నారు. 

గతంలోలాగ సినిమా రిలీజ్ అయ్యాక చూసి..అరెరే..ఇది ఫలానా హాలీవుడ్ కాపీ కదా అనుకునే రోజులు పోయాయి. సినిమా ప్రారంభం కాకముందే ఆ సినిమా దేని నుంచి ఎత్తుతున్నారో మీడియా, సినిమా జనం చెప్పేస్తున్నారు. ఇప్పుడు నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో రూపొందే చిత్రం సైతం ఓ హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే....మనం, 24, హలో లాంటి డిఫరెంట్‌ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో నాని సరసన ఐదుగురు హీరోయిన్స్ నటించబోతున్నారని సమాచారం. 

ఈ సినిమాను హాలివుడ్‌లో వచ్చిన ‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్ బటన్’ అనే సినిమా స్పూర్తితో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. అందులో ఒకటి యంగ్ క్యారెక్టర్, మరోకొటి మిడిల్ ఏజ్ లుక్, చివరది ముసలోడి పాత్రలో నటించబోతున్నట్టు మీడియా వర్గాల సమాచారం. 

అలాగే ఈ సినిమాలో విలన్‌గా RX100 ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని కార్తికేయ..నానితో దిగిన ఫోటోను పోస్ట్ చేసి మరి కన్ఫామ్ చేసాడు.

ఈ సినిమాలో కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళ సంగీత యువ సంచలనం అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 19 నుంచి జరుగనున్నట్లు తెలిపారు.