Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ సీజన్ 2 లో నానికి భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ సీజన్ 2 లో నానికి భారీ రెమ్యునరేషన్ 

Nani to have huge remuneration for big boss season 2

బిగ్ బాస్ అన్ని భషలలోను సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తెలుగు అయితే బంపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అది అంతలా హిట్ కావటానికి ఎన్టీఆర్ ముఖ్య కారణం అని ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. శని ఆది వారాలు వచ్చి పార్టిసిపెంట్స్ని ఉత్సాహపరుస్తూ ప్రేక్షకులను అలరిస్తూ టిఆర్పీని అదిరిపోయేలా పెంచాడు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 2 మొదలవ్వబోతోంది. ఆ కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్ నానీని ఎంపిక చేశారు నిర్వాహకులు. అందుకోసం నానీని బాగానే పారితోషకం అందిస్తున్నారని తెలుస్తోంది. 

బిగ్ బాస్ సీజన్ 1కు గానూ ఎన్టీఆర్ ఎనిమిది కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకున్నారు. మరి నానీకి ఎంతిస్తున్నారు? న్యాచురల్ స్టార్ కు కూడా అతని సినిమా పారితోషకానికి ఏమాత్రం తీసుపోకుండానే ఆఫర్ చేశారట. సాధారణంగా నానీ సినిమాకు 5 నుండి 7 కోట్ల వరకు తీసుకుంటాడు. బిగ్ బాస్ సీజన్ 2కు ముప్పై రోజుల డేట్స్ ఇచ్చాడు. అందుకే ఆయనకు రెండున్నర కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించారట బిగ్ బాస్ నిర్మాతలు. 

ఎన్టీఆర్ అంతా తానై మొదటి సీజన్ను బాగానే రక్తి కట్టించాడు. మాటల మంత్రంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు మరి నానీ ఏ మేరకు వేదికపై  అలరిస్తాడో... జోకులు పేలుస్తాడో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ సెలెక్షన్ అయ్యింది కానీ పార్టిసిపెంట్ల ఎంపిక ఇంకా జరుగుతూనే ఉంది. ఈసారి ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడతారో అని ప్రేక్షకులకు కాస్త ఉత్కంఠ కలుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios