ఒక కథని ఒక హీరోతో అనుకుని కొద్ది కాలం వర్క్ చేసాక,రకరకాల రీజన్స్ తో ఆ  ప్రాజెక్టు ప్రక్కకు వెళితే కొందరు దర్శకులు ఆ హీరో డేట్స్ వచ్చే వరకూ వెయిట్ చేస్తారు. అయితే విక్రమ్ కుమార్ లాంటి స్టార్ డైరక్టర్స్ మాత్రం వెంటనే మరో హీరోని ఫైనలైజ్ చేసుకుని ముందుకు వెళ్తారు. అదే స్క్రిప్టుతోనా లేక వేరే స్క్రిప్టుతోనా అనేది అప్పటి పరిస్దితిని బట్టి ఉంటుంది.   

తాజాగా నాని దగ్గరకి విక్రమ్ కుమార్ అలాగే వచ్చారు. విక్రమ్ కుమార్ ..బన్ని తో  చేద్దామనుకున్న ప్రాజెక్టు వెనక్కి వెళ్లింది. త్రివిక్రమ్ అక్కడ మెగా ఫోన్ పడుతున్నారు. దాంతో ఆయన నానితో సినిమా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..   తెలుగులోని  హీరోలలో నానికంటూ స్పెషల్  స్థానం వుంది.   

వాస్తవానికి దగ్గరగా ఉండేలా తన పాత్రలు డిజైన్ చేసుకుంటూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటాడు. అందువల్లనే నాని ఖాతాలో హిట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.  ఆచి తూచి అడుగులు వేసే  నాని ప్రస్తుతం 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత ఆయన విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.  

ఇంతకు ముందే  వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. అల్లు అర్జున్ తో చేయవలసిన ప్రాజెక్టు వాయిదా పడటంతో, అంతకు ముందు నానితో అనుకున్న సినిమా చేయడానికి విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. అశ్వనీదత్ బ్యానర్లో ఈ సినిమా ఉండొచ్చుననే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

మరో ప్రక్క సుకుమార్ కి కూడా నాని ఓకే చెప్పాడనే వార్త వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ సినిమా తరువాత ఆ ప్రాజెక్టు ఉండొచ్చని తెలుస్తోంది.