నానికి టెన్షన్ స్టార్టైంది. ఆయన తన తదుపరి చిత్రం జెర్సి పైనే పూర్తి నమ్మకాలు పెట్టుకున్నారు. ఆయన గత చిత్రాలు కృష్ణార్జున యుద్దం, దేవదాస్ రెండు కూడా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దేవదాస్ ఆడిందన్నారు కానీ డబ్బులు రికవరీ కాలేదని తేలిపోయింది. దాంతో నాని సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఒక నిముషం ఆలోచించి అడుగు వేసే పరిస్దితి. కానీ జెర్సి చిత్రాన్ని 35 కోట్లకు నిర్మాతలు  బిజినెస్ చేసారని సమాచారం. 

ఈ ప్రాజెక్ట్ కు టీజర్ రిలీజ్ చెయ్యగానే క్రేజ్ వచ్చేసింది. దాంతో సినిమాను మంచి రేటుకు అమ్మేసారు. ఈ విషయమై నాని ఆందోళన చెందుతున్నాడట. బిజినెస్ జరిగిన స్దాయిలో రికవరీ ఉంటుందా తన స్దాయి హీరోలకు అనే ఆలోచనలో పడటమే కాకుండా తన సన్నిహితులతో చర్చిస్తున్నాడట. నిర్మాతలు కాస్త ఆచి, తూచి అడుగు వేసి ఉంటే బిజినెస్ చేసి ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని అంటున్నాడట.

సినిమా బాగానే వచ్చినా అది స్పోర్ట్స్ డ్రామా కావటంతో  మల్టిప్లెక్స్ లకే కాకుండా బి,సి లకు వెళ్తుందా అనే అనుమానం ఉంది. అదే కనుక జరిగితే 35 కోట్లు రికవరీ అనేది చాలా కష్టమైపోతుంది. నాని పై ప్రెజర్ పడిపోతుంది. మాజీ క్రికెటర్ రామన్ లంబా బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో తక్కువే. 

ఇంతకీ కథేంటి

ఈ సినిమా 80-90 దశకం మధ్య జరిగిన కథగా తెరకెక్కుతోంది. అంటే స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ, ఇంటర్ నెట్, 4జి, డిజిటల్ టీవీ ఇవేవి లేని కాలానికి జెర్సి జరగబోతోందన్నమాట. నాని ఇందులో ఒక క్రికెటర్. తనలో టాలెంట్ ఉంటుంది కానీ అది జాతీయ టీమ్ కు ఆడే స్థాయిలో ఉంటుందని గుర్తించక సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. అనుకోకుండా ఓ లోకల్ మ్యాచ్ సందర్భంలో సబ్ స్టిట్యూట్ గా వెళ్లాల్సి వచ్చి ఊహించని విధంగా తన టీమ్ గెలుపుకు కారణమయ్యే అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇస్తాడు. 

అక్కడ నుంచి కథ కొత్త మలుపులు తిరుగుతుంది. వయసు కాస్త లేట్ అయినా తాను కష్టపడితే జాతీయ స్థాయికి వెళ్లొచ్చని గుర్తించిన నాని దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నెన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు. అన్నింటిని దిగమింగుకుని తానేంటో ప్రపంచానికి చాటి చెప్పేలా నాని టార్గెట్ చేరుకుంటాడు. ఇదీ కథ అని వినిపిస్తోంది. 

వాస్తవానికి దగ్గరగా ఉంటూనే  సామాన్య ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దారని చెప్పారు.  కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ దెబ్బకు కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్న నాని జెర్సి చాలా స్పెషల్ మూవీ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు.