నానికి స్టూడెంట్ ప్రశ్న, అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన నేచురల్ స్టార్
మీరు ఎప్పుడూ యంగ్ డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయరా..? నేచురల్ స్టార్ నానికి స్టుడెంట్స్ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. ఇంతకీ ఆయన ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే..?
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఆమధ్య వరుస ఫెయిల్యూర్స్ చూసిన నాని. ఈమధ్య దసరా సినిమాతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు. అంతే కాదు ప్రయోగాత్మక సినిమాలకు పెద్ద పీట వేస్తూ.. మంచి మంచి కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు నాని. మరో విశేషం ఏంటంటే.. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తూ.. దూసుకుపోతున్నాడు. కొత్తవారికి కూడాఛాన్స్ లు ఇస్తూ..మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. ఈ విషయంలో నాని రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నాడు.
తాజాగా నాని నుంచి రాబోతున్న కొత్త సినిమా హాయ్ నాన్న. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. డిసెంబర్ 7న రిలీజ్ కాబోతోంది మూవీ. ఇక కాస్త ముందుగానే సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు టీమ్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈసినిమానుంచి వరుసగా సాంగ్స్ ను లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ముచ్చటగా మూడో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు టీమ్. అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)లో నిర్వహించారు.
సందర్భంగా ఈవెంట్‌కు వెళ్లిన మూవీ టీమ్‌తో.. అక్కడున్న స్టూడెంట్స్‌తో ముచ్చటించారు. ఇక ఇక హీరో నాని కూడా స్టూడెంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే ఓ స్టూడెంట్ నానిని ప్రశ్నిస్తూ.. నాని అన్న మీరు చిన్న దర్శకులతోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారు. పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదు అని ఓ స్టూడెంట్ నానిని ప్రశ్నించారు. దానికి నాని సమాధానమిస్తూ.. మీరు అనుకుంటే ఇంకా పెద్ద హీరో సినిమాలు చూసేందుకు వెయిట్ చేయవచ్చు. కానీ నా కోసమే ఎందుకు థియేటర్‌కు వస్తున్నారు.
మనసుకు నచ్చిన పని చేసుకుంటూ మనం వెళ్లిపోతున్నాం. అలాగే మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు. నేనూ అంతే అని నాని అన్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మూడో సింగిల్ కూడా ఆడియన్స్ ను అలరిస్తోంది మృణాల్ ఠాకూర్ తో నాని కాంబో కొత్తది కావడంతో.. మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈసినిమా నానికి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.