న్యాచురల్ స్టార్ నాని మొన్నటివరకు గ్యాంగ్ లీడర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న రానున్న ఈ ప్రాజెక్ట్ పనులు ఎడింగ్ కు వచ్చేశాయి. ఇక నానికి ఆ ప్రాజెక్ట్ తో దాదాపు అవసరం తీరిపోయినట్లే. ఇక నాని మరో ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు. ఎట్టకేలకు తన 25వ సినిమా షూటింగ్ లో న్యాచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు. 

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కనున్న V సినిమా షూటింగ్ కొన్ని వారాల క్రితమే స్టార్తయింది. సుధీర్ బాబు - అదితి రావ్ హైదరి కి సంబందించిన సీన్స్ ను ముందే షూట్ చేశారు. అప్పుడు నాని బిజీగా ఉండటం వల్ల తన షెడ్యూల్ ని మార్చుకోవాల్సివచ్చింది.  గ్యాంగ్ లీడర్ సినిమాతో బిజీగా ఉన్న నాని ఈ ప్రాజెక్ట్ లో పాల్గొనడానికి చాలా సమయం పట్టింది. మొత్తానికి నేడు ఉదయం మొదటి షాట్ లో నటించాడు. 

ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ వేషాలు వేయనున్నట్లు టాక్. అలాగే సిక్స్ ప్యాక్ లో కూడా కనిపిస్తాడని సమాచారం. నాని గత చిత్రాలకు బిన్నంగా ఈ సిల్వర్ జూబిలీ ఫిల్మ్ డిఫరెంట్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు.