నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం `శ్యామ్‌ సింగరాయ్‌`. `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల తేదీని ఖరారు చేశారు. నాని పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. 

ఫిబ్రవరి 24న నాని పుట్టిన రోజు కావడంతో `శ్యామ్‌ సింగరాయ్‌` ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నామని నాని ట్విట్టర్‌ ద్వారా  వెల్లడించారు.ఈ సందర్భంగా చిన్న వీడియో క్లిప్‌ని పంచుకున్నారు. ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్‌ అని టైప్‌ చేస్తున్నట్టుగా  ఉంది. ఈ సినిమా  మొదటి నుంచి ప్రత్యేకతని చాటుకుంటున్నారు. టైపింగ్‌ మెథడ్‌లో వివరాలను వెల్లడిస్తున్నారు. 

`టాక్సీవాలా`వంటి  ఓ డిఫరెంట్‌ చిత్రాన్ని డీల్‌ చేసి దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ ప్రశంసలందుకున్నారు. ఈ సినిమా లీక్‌ అయినా, ఆ తర్వాత థియేటర్‌లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక నాని ప్రస్తుతం `శ్యామ్‌సింగరాయ్‌`తోపాటు `టక్‌జగదీష్‌`, `అంటే సుందరానికి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.