నాని హీరోగా నటించిన యాక్షన్ ఎంటరైనర్ 'వి'. నాని 25వ చిత్రంగా విడుదల అవుతున్న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకొనేలా కనిపించకపోవడంతో నిర్మాత దిల్ రాజు ఓ ఫ్యాన్సీ ప్రైస్ కి వి మూవీని ప్రైమ్ కి అప్పగించేశారు. సెప్టెంబర్ 5నుండి ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. 

కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఒకటిన్నర నిమిషం ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సీరియస్ నోట్ లో నాన్ స్టాప్ యాక్షన్ కలిగిన ఈ ట్రైలర్ మరింత ఆసక్తి పెంచుతుంది. ఇక ఇది ఓ సైకో కిల్లర్, ఇంటెలిజెంట్ పోలీస్ మధ్య నడిచే వార్ డ్రామాగా ఉంది. సైకో కిల్లర్ గా నాని ఆటిట్యూడ్, మేనరిజం టోటల్ డిఫరెంట్ గా ఉన్నాయి. నెగెటివ్ షేడ్ రోల్ లో నాని రెచ్చి పోయి నటించినట్లు ఉన్నాడు. ఆయన నటన చాలా సహజంగా ఉంది. 

ఇక మరో హీరో సుధీర్ కూడా యాక్షన్ సన్నివేశాలలో రెచ్చిపోయారు. కండల శరీరంతో ఆయన యాక్షన్ ఫీట్స్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ నివేధా థామస్ ది కూడా కీలక రోల్ అని తెలుస్తుంది. మరో హీరోయిన్ అదితి రావ్ హైదరి కూడా ఈ మూవీలో నటిస్తుండగా ఆమెను టీజర్, ట్రైలర్స్ లో రివీల్ చేయలేదు. దీనితో కథలో అసలు మలుపు ఆమెతో ముడిపడి ఉండే అవకాశం కలదు. దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రానికి బీజీఎమ్ థమన్, సాంగ్స్ అమిత్ త్రివేది అందిస్తున్నారు.