Asianet News TeluguAsianet News Telugu

పట్టువీడిన దిల్ రాజు, నాని 'వి' ఓటిటి లో వచ్చేస్తోంది!

హీరో నాని ఓ టి టి ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఆయన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి మూవీ ఓ టి టి విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర నిర్మాత దిల్ రాజు  ఫ్యాన్సీ ప్రైస్ కి ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మివేయడం జరిగింది.

Nani starer V movie ott release conformed
Author
Hyderabad, First Published Aug 12, 2020, 12:19 PM IST

లాక్ డౌన్ కారణంగా బాగా నష్టపోయిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఆయన నిర్మాణంలో ఉన్న మూడు చిత్రాలు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డాయి. వి, వకీల్ సాబ్ మరియు జెర్సీ హిందీ రీమేక్ చిత్రాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు. నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వి విడుదల సిద్ధంగా ఉండగా, వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షాహిద్ కపూర్ నటిస్తున్న జెర్సీ హిందీ రీమేక్ చిత్రీకణ జరుపుకుంటుంది. ఈ మూడు చిత్రాలపై వంద కోట్లకు పైగా దిల్ రాజు పెట్టుబడి స్థంభించి పోయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చిలో లో వి, మే నెలలో పవన్ నటించిన వకీల్ సాబ్ విడుదల అయ్యేవి.

విడుదలకు సిద్ధంగా ఉన్న వి కి ఎప్పటి నుండో ఓ టి టి సంస్థల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఐతే థియేటర్స్ తెరుచుకుంటాయనే ఆశాభావంతో ఉన్న దిల్ రాజ్ నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు థియేటర్స్ తెరుచుకునే మార్గం లేదు. దీనితో దిల్ రాజు పట్టువీడినట్లు తెలుస్తుంది. ఓ టి టి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ని దక్కించుకుంది. దాదాపు రూ. 33.2 కోట్లు వెచ్చించి వి చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం. ఈ భారీ చిత్రంతో తన చందాదారుల సంఖ్య భారీగా పెరుగుతుందని అమెజాన్ భావిస్తుంది. సెప్టెంబర్ 5వ తేదీ నుండి  వి మూవీ అందుబాటులోకి వచ్చే అవకాశం కలదు. 

దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారు. మరో హీరో సుధీర్ పోలీసుగా కీలక రోల్ చేయడం విశేషం. కిల్లర్ అండ్ పోలీస్ మధ్య జరిగే వార్ ఈ మూవీ ప్రధానాంశంగా తెలుస్తుంది. ఇక నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నారు. నాని వి మూవీతో మొదటిసారి ఓ టి టి ఎంట్రీ ఇస్తున్నట్లు అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios