తన అభియిష్టానికి విరుద్ధంగా వి మూవీని ఓ టి టి లో విడుదల చేయడంతో నాని గుర్రుగా ఉన్నారు. నానికి వి 25వ చిత్రం కాగా తన ల్యాండ్ మార్క్ మూవీ థియేటర్స్ లోనే విడుదల చేయాలని నాని కోరుకున్నారు. ఐతే అది కుదర్లేదు. దిల్ రాజు నష్టాల భారం తగ్గించుకోవడానికి ప్రైమ్ కి బెస్ట్ డీల్ కి అమ్మేశాడు.  మనసులో అభిప్రాయం ఏదైనా కానీ మూవీకి ప్రచారం కల్పించుకోవడం హీరోగా నాని బాధ్యత, అలాగే కెరీర్ కి అవసరం. దీనితో అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్  5న విడుదల కానున్న వి కోసం వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కాగా హీరో నానికి మరో షాక్ తగిలినట్లు తెలుస్తుంది. 

వి మూవీ స్టోరీ పూర్తిగా లీకైందని వార్తలు వస్తున్నాయి. అలాగే వి మూవీ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నాని ఈ మూవీలో సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. ఐతే ఆయన కిల్లర్ గా మారడానికి కారణం భార్య అదితి రావ్ హైదరిని కొందరు దారుణంగా చంపివేస్తారట. తన భార్య చావుకు కారణమైన వారిని చంపడం కోసం డెడ్లి కిల్లర్ గా నాని మారతాడట. ప్రతి మర్డర్ దగ్గర నాని వి అనే లెటర్ వదిలి వెళ్తాడట.ఇక నానిని వెంటాడే పోలీసుగా సుధీర్ కనిపిస్తాడట. 

ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అలాగే ఈ మూవీలో అసలు విలన్ సుధీర్ అని, అదే సినిమాలో షాకింగ్ ట్విస్ట్ అనే మాట కూడా వినబడుతుంది. ఇందులో నిజమెంతుందో  తెలియదు కానీ, స్టోరీ మాత్రం ప్రేక్షకులు తెగ నచ్చేసింది. వి చిత్రానికి సూపర్ రెస్పాన్స్ దక్కడం ఖాయం అంటున్నారు. వి మూవీని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించగా అమిత్ త్రివేది సంగీతం అందించారు.