సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా పొగడాల్సి వస్తే దానికి హద్దులు ఉండవు. ఇక స్టేజ్ మీద దర్శకులు, హీరోలను.. హీరోలు నిర్మాతలను ఇలా ఒకరినొకరు పొగుడుకుంటూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్లు మొత్తం ఇలానే సాగుతున్నాయి.

తాజాగా 'జెర్సీ' సినిమా అప్రిసియేషన్ వేడుక జరిగింది. సినిమా బాగా నచ్చడంతో నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన 'జెర్సీ' టీమ్ ని అభినందించారు. ఈ క్రమంలో నాని స్పీచ్ విన్న వారంతా.. కాస్త అతి ఎక్కువైందనే కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి సినిమాలో చక్కటి సోల్ ఉంది కాబట్టి సక్సెస్ అయింది. అయితే నాని మాత్రం వీటితో పాటు దిల్ రాజు ఫ్యాక్టర్ కూడా కలిసి రావడంతో సినిమా సక్సెస్ అయిందని  అంటున్నాడు.

''సినిమా ఉదయం ఆట చూసి దిల్ రాజు గారు ఫోన్ చేశారంటేనే సినిమా హిట్ అయినట్లు.. ఈ సినిమాకి కూడా ఉదయం గేటు నుండి అడుగుపెడుతుంటే దిల్ రాజు గారు ఫోన్ చేశారు. ఆ కాల్ రాగానే నాకు క్లారిటీ వచ్చేసింది'' అంటూ దిల్ రాజు చెప్తేనే సినిమా హిట్ అయినట్లని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి నాని తన పొగడ్తలతో దిల్ రాజుని చెట్టు ఎక్కించేశాడు. దిల్ రాజు స్పెషల్ గా టీమ్ ని అభినందించడంలో కూడా ఓ కారణముందని అంటున్నారు. మరి హీరో నానితో సినిమా ప్లాన్ చేస్తాడో.. లేక దర్శకుడు గౌతం ని లాక్ చేస్తాడో చూడాలి!