Asianet News TeluguAsianet News Telugu

Shyam Singha Roy: నాని ‘శ్యామ్ సింగ రాయ్’ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్

థియేటర్లో రిలీజ్‌ అయిన ఈమూవీని భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. 

Nani Shyam Singha Roy ott release plan
Author
Hyderabad, First Published Jan 8, 2022, 6:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రలలో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో రిలీజైన 'శ్యామ్ సింగ రాయ్' చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నానికి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు శ్యామ్‌ సింగరాయ్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది.జనవరి 26న  గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా శ్యామ్ సింగరాయ్ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని సమాచారం.  త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. 

సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలయిన 90 రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని సినీ నిర్మాణ సంస్థలు షరతును పెట్టాయి. కానీ కోవిడ్ పరిస్దితులతో  అన్ని రోజుల వరకు సినిమాలు థియేటర్లలో కూడా ఉండే అవకాశం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు.  ఒక్క పక్క మూవీ థియేటర్లలో ఉన్నా కూడా మరోపక్క ఓటీటీలో విడుదల చేసేస్తోంది మూవీ టీమ్.
 
 
చిత్రం కథేమిటంటే... వాసు(నాని) కు పెద్ద డైరక్టర్ కావాలనే కల. అందుకోసం ఓ షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోలానుకుంటాడు. కీర్తి(కీర్తి శెట్టి)ని ఒప్పించి హీరోయిన్ గా తన షార్ట్ ఫిల్మ్ ని ఫినిష్ చేస్తాడు. దాంతో ప్రొడ్యూసర్ ని ఒప్పించి సినిమా చేస్తాడు. ఆ సినిమా సూపర్ హిట్టై హిందీ రీమేక్ ఆఫర్ తెచ్చి పెడుతుంది. వాసు ఆ ఆనందంలో ఉండగానే అతని పై కాపీ కేసు పడుతుంది. అతను చేసిన సినిమా కథ...యాజటీజ్ గా 1960 లలో శ్యామ్ సింగరాయ్ అనే బెంగాళి రచయిత రాసిన కథను పోలి ఉంటుంది. చివరకు పాత్రల పేర్లు కూడా అవే. దాంతో ఆ స్టోరీ రైట్స్ కలగిన కలకత్తాకు చెందిన సంస్ద వారు కేసు వేస్తారు. అయితే వాసు అసలు తాను ఆ రచయిత పేరు ఎప్పుడూ వినలేదంటాడు. 

Also Read :Sathyaraj: సత్యరాజ్ కు కోవిడ్, హటాత్తుగా సీరియస్..హాస్పిటల్ కు తరలింపు

లై డిటెక్టర్ తో టెస్ట్ చేయిస్తుంది కోర్టు. అతను అబద్దం చెప్పటం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో వాసుని క్లినికల్ హిప్నాసిస్ చేయ‌గా ఊహింజచని  ఓ కొత్త విషయం రివీల్ అవుతుంది. అదే ‘శ్యామ్ సింగ రాయ్’..ఇప్పటి వాసుగా పునర్జన్మ ఎత్తారని. ఇంతకీ అసలు ఈ శ్యామ్ సింగ రాయ్ ఎవరు? తనకు వాసు దేవ్ కు ఉన్న సంబంధం ఏంటి? శ్యామ్ వెనుక ఉన్న కథేంటి?మ‌రి అత‌ని క‌థేంటి?  దేవ‌దాసి మైత్రీ అలియాస్ రోజీ (సాయిప‌ల్ల‌వి)తో అత‌ని ప్రేమ‌ క‌థేంటి?  అస‌లు వాళ్లిద్ద‌రికీ ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
  
 
నటీనటులు:
బ్యాన‌ర్: నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం తదితరులు.
ఒరిజిన‌ల్ స్టోరీ: స‌త్య‌దేవ్ జంగా
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ను జాన్ వ‌ర్ఘీస్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌టర‌త్నం (వెంక‌ట్‌)
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
 డైరెక్ట‌ర్‌: రాహుల్ సాంకృత్యాన్‌
ప్రొడ్యూస‌ర్‌: వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి
రన్ టైమ్ : 2 గంటల 37 నిమిషాలు
రిలీజ్ డేట్ : 24 డిసెంబర్ 2021

Follow Us:
Download App:
  • android
  • ios