ఎన్నో  పాత్రలకు నటనతో ప్రాణం పోశారు సత్యరాజ్. తాజాగా ఈ నటుడు హాస్పటిల్ లో జాయిన్ అవ్వటంతో సినీ ప్రేమికలు ఆందోళన చెందుతున్నారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.


తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు కోవిడ్ రావటంతో ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే హఠాత్తుగా హెల్త్ కండీషన్ సీరియస్ అవ్వటంతో చెన్నైలోని ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో జాయన్ చేసారు.. ఈ పేరు చెప్తే ప్రేక్షకులు గుర్తుపడతారో లేదో తెలియదు కానీ.. కట్టప్ప అనగానే తెలుగువారే కాదు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ వెంటనే గుర్తుపట్టేస్తారు. అలాంటి ఎన్నో పాత్రలకు నటనతో ప్రాణం పోశారు సత్యరాజ్. తాజాగా ఈ నటుడు హాస్పటిల్ లో జాయిన్ అవ్వటంతో సినీ ప్రేమికలు ఆందోళన చెందుతున్నారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

మరో ప్రక్క దేశవ్యాప్తంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు వరుసగా కోవిడ్ (Covid) బారినపడుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్‌గా (Corona positive‌) తేలింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా మహేశ్‌బాబు, మంచు లక్ష్మి, తమన్‌ (Thaman‌) తదితరులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

 త్రిషకు కరోనా సోకింది. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్‌ సోకిందని తెలిపారు త్రిష. దీనికి సంబంధించి ఆమె తాజాగా ట్వీట్‌ చేసింది. వైరస్‌ నుంచి వేగంగా కోలుకుంటున్నానని.. అంతేకాదు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నానని.. దీని వల్లే త్వరగా కోలుకుంటున్నాని వ్యాక్సిన్ వల్ల మేలు జరిగిందని పేర్కోన్నారు. త్రిష ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తమన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేసారు. తనను కలిసి వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోమని తెలియజేసారు. నిన్ననే మహేష్ బాబు తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా తమన్ కరోనా టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా తేలింది.