శ్రీరెడ్డికి హీరో నాని భలే షాక్

Nani serves kegal notice to Sri Reddy
Highlights

సినీ హిరో నాని తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డికి గట్టిగానే షాక్ ఇచ్చారు.

హైదరాబాద్‌: సినీ హిరో నాని తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డికి గట్టిగానే షాక్ ఇచ్చారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని అన్నారు. తనపై విమర్శలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డికి ఆయన లీగల్ నోటీసులు పంపించారు .

సోషల్ మీడియాలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పరువుకు నష్టం కలిగించిందంటూ నాని ఆమెకు నోటీసులు పంపించారు . పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చామని, ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు హాజరై ఆమె చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాని తరఫు న్యాయవాదులు అన్నారు.

తనపై వస్తున్న ఆరోపణలపై నాని ట్వీట్లు చేశారు. ప్రతి చిన్న విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని, ఆరోపణలు చేసిన వాళ్లు అడిగే ప్రతి అంశంపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. 

న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించామ ని, పరువు నష్టం కింద నోటీసులు పంపించానని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు. తానేం అందోళన చెందడం లేదని అన్నారు. 

అందరికీ కుటుంబాలుంటాయని, ఇలాంటి తప్పుడు ఆరోపణలను, వార్తలను వ్యాప్తి చేయకపోవడం మంచిదని అన్నారు. నేను దీనిపై మరోసారి కామెంట్‌ చేయదలుచుకోలేదని ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.

"నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతి త్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే" అని శ్రీరెడ్డి ఇటీవల పెట్టిన పోస్టు దుమారం రేపింది.

loader