గత కొద్ది రోజులుగా నాని, సాయి ధరమ్ తేజ ఇద్దరూ కూడా ఓ విధమైన షాక్ లో ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అందుకు కారణం వారి ఎక్సపెక్టేషన్స్ కు భారీ ఎత్తున దెబ్బ తగలటమే అంటున్నారు. సాయి ధరమ్ తేజ  అయినా కొద్దిగా ఫరవాలేదు కానీ నాని మాత్రం జెర్శీ సినిమా భాక్సాఫీస్ రిజల్ట్ ని డైజస్ట్ చేసుకోలేకపోయాడంటున్నారు.  జెర్సీ సినిమాకు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ రావటం, తను చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోవటం తో సినిమా ఓ రేంజిలో సమ్మర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించాడట నాని. 

అయితే అదే సినిమాతో పాటు రిలీజైన కాంచన 3 చిత్రం కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతూంటే జెర్శీ మాత్రం చాలా చోట్ల డల్ అయ్యిపోయింది. నాని గత సినిమా దేవదాసు కలెక్షన్స్ ని చాలా చోట్ల గుర్తు చేసింది. అర్బన్ సర్కిల్స్ లో మాత్రమే ఈ చిత్రం సొమ్ము చేసుకోగలిగింది. దాంతో మల్టిప్లెక్స్ లో ఉన్నంత కలెక్షన్స్ మిగతా చోట్ల లేకపోవటం నానిని ఆలోచనలో  పడేసింది. జెర్సీ సినిమాకు నష్టాలు లేకపోయినా, రికవరీ మాత్రం ఎక్సపెక్టే చేసిన రేంజిలో లేకపోవటం నానికు ఏ తరహా సినిమా చేయాలనే విషయమై ఆలోచనలో పడేసింది. దాంతో నాని తనకు భలే భలే మొగాడివోయ్ ఇచ్చిన సక్సెస్ రావాలంటే మళ్లీ అలాంటి కామెడీ చేయాలేమో అని భావిస్తున్నాడట.

సాయి ధరమ్ తేజ సైతం కొంచెం అటూ ఇటూలో అదే సిట్యువేషన్. వరస ఆరు ఫ్లాఫ్ ల తర్వాత చిత్రలహరి చిత్రంతో తాను ఒడ్డున పడ్డానని భావించాడు. అయితే ఆ సినిమా ఫస్ట్ వీకెండ్ లో చూపించిన జోర్ ని తర్వాత కంటిన్యూ చేయలేకపోయింది. దాంతో ఈ సినిమా తనకు గత సినిమాల కన్నా బెటర్ అన్న ఫీలింగ్ ఇచ్చింది కానీ తనపై పెట్టిన పెట్టుబడికి భరోసా ఇవ్వలేకపోయింది. దాంతో సాయి ధరమ్ తేజ మళ్లీ మాస్ సినిమాలు చేస్తే బెటర్ ఏమో అన్న నిర్ణయానికి వచ్చాడట.