Asianet News TeluguAsianet News Telugu

నాని హిట్ సినిమా రైట్స్ కరుణ్ జోహార్ చేతికి, హిందీలోకి రీమేక్!

గత కొంతకాలంగా బాలీవుడ్ మార్కెట్ పూర్తిగా సౌత్ సినిమాలపై ఆధారపడుతోంది. 

Nani's Jersey movie talk and story line
Author
Hyderabad, First Published Jun 25, 2019, 11:49 AM IST

గత కొంతకాలంగా బాలీవుడ్ మార్కెట్ పూర్తిగా సౌత్ సినిమాలపై ఆధారపడుతోంది. తెలుగు,తమిళ, మళయాళంలో హిట్ అయ్యిన  చిత్రాలను తీసుకుని రీమేక్ చేసి హిట్ కొట్టడం ఆనవాయితీగా మారింది. తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం కబీర్ సింగ్ ఘన విజయం సాధించటంతో తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలపై అక్కడ నిర్మాతల దృష్టి పడింది. తాజాగా నాని హిట్ చిత్రం జెర్శీ రైట్స్ ని కరుణ్ జోహార్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. 

నాని హీరోగా నటించిన `జెర్సీ`  ఏప్రియల్ 19న  రిలీజ‌్ అయి మంచి హిట్ అయ్యిన  సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన  ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలను సైతం తెచ్చి పెట్టింది. దాంతో కరుణ్ జోహార్ మంచి రేటుకే ఈ చిత్రం రైట్స్ ని తీసుకున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ కి సైతం  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని పోషించిన పాత్రలో బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తారట. అయితే ఈ రీమేక్ కి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది. 

చిత్రం కథేమిటంటే..ప్రేమించి పెళ్లి చేసుకున్న నాని (అర్జున్)  కు వైవాహిక జీవితం అంత గొప్పగా ఉండదు. తన కెంతో ఇష్టమైన క్రికెటర్ గా ఎదగాలన్న కోరిక ని వదిలేసుకుంటాడు. తన భార్య సంపాదనపై బ్రతకుతూంటాడు. వాళ్లకో కొడుకు నాని...అతనితోనే అర్జున్ జీవితం.  అయితే ఓ రోజు కొన్ని పరిస్దితుల్లో తను కోల్పోయిన గౌరవాన్ని, తన కొడుకు ఆనందాన్ని తన క్రికెట్ ఆటలో చూసుకోవాలనుకుంటాడు. దాంతో  లేటు వ‌య‌సు క్రికెటర్ గా  ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తాడు.  ఆ క్ర‌మంలో అర్జున్ ఎదుర్కొన్న సమస్యలేంటి? అత‌డు భార‌త జ‌ట్టుకు ఎంపిక కావాలని చేసే ప్ర‌య‌త్నం ఫలించిదా  లేదా? అన్న‌దే సినిమా.

క్రికెట్ నేపధ్యంలో  జరిగే  ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా లో ... నాని విశ్వరూపం చూపించాడు. పర్శనల్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోయే ఈ కథ నాని మార్కెట్ ని జస్టిఫై చేసింది. న్యాచురల్ స్టార్ అంటే ఈ సినిమాలో చూపించాడు. అలాగే 1980-90ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్టాఫ్ ..హీరో యూత్, రొమాంటిక్ లైఫ్ ని డీల్ చేస్తూ సాగితే.. సెకండాఫ్ పూర్తిగా ఎమోషన్ గా, లేటు వయస్సులో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో అతను పడే  స్ట్రగుల్స్ ని చూపుతుంది. కథగా కన్నా కథనం మీద ఎక్కువగా ఆధారపడి తీసిన సినిమా ఇది.  హిందీలో సైతం వర్కవుట్ అవుతుంద ని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios