నేచురల్ స్టార్ నానికి టాలీవుడ్ లో ప్రత్యకమైన గుర్తింపు ఉంది. నాని తనకంటూ సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. నటనకు ఆస్కారం ఉండే చిత్రాలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. నాని చివరగా నటించిన జెర్సీ చిత్రం మంచి విజయం సాధించడమే కాక నటుడిగా ప్రశంసలు దక్కేలా చేసింది. 

ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రతిభగల దర్శకుడు విక్రమ్ కుమార్ ఏఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే ఆధారంగా ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. 

సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్యాంగ్ లీడర్ లోని సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేసారు. 

అనిరుద్ సంగీతంలో హొయినా హొయినా అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఇన్నో గెంగా ఈ పాటని పాడారు. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.