నేచురల్‌ స్టార్‌ నాని,డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.

దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. 'యూఏ' సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. నిన్న రాత్రి వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

తాజాగా సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో బట్టి సినిమా షూటింగ్ ఎంతో జాలీగా, ఎమోషనల్ గా సాగిందో అర్ధమవుతోంది. సినిమాలో కామెడీ ఎంత ఉంటుందో ఎమోషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఈ మేకింగ్ వీడియో ద్వారా డైరెక్టర్ విక్రమ్ తెలియజేస్తున్నాడు. 

ఒక సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో విక్రమ్ కట్ చెప్పి నటీనటుల నటనకు ఆయన ఎమోషన్ అయి కంటతడి పెట్టారు. ఈ వీడియోలో దర్శకుడు సుకుమార్ కూడా కనిపించారు. వీడియో చివరిలో కట్ చెప్పి పైకిలేచి సూపర్ అంటూ సింబాలిక్ గా చూపించారు. ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. కచ్చితంగా నాని హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నారు.