నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించారు. కానీ సినిమా ఇప్పుడు వాయిదా పడుతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

ఆగస్ట్ 30న విడుదల చేస్తున్నామని మొదటినుండి చెప్పుకొచ్చింది చిత్రబృందం. అయితే ఇప్పుడు 'సాహో' సినిమాను పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ నెలాఖరున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 'గ్యాంగ్ లీడర్' టీమ్ ఆలోచనలో పడింది.

'సాహో' లాంటి భారీ సినిమాతో పోటీకి దిగడం కంటే వాయిదా వేయడం మంచిదని భావిస్తున్నారట. అందుకే ముందుగా అనుకున్నట్లుగా ఆగస్ట్ 30న కాకుండా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా మలయాళీ బ్యూటీ అరుణ్ మోహన్ కనిపించనుంది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.