Asianet News TeluguAsianet News Telugu

అలాంటి కామెంట్ చేసినందుకు బాధపడుతున్నా : నానీ

నటులుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. పదాల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Nani regretted his comments on Arshad Warsi jsp
Author
First Published Aug 23, 2024, 12:03 PM IST | Last Updated Aug 23, 2024, 12:03 PM IST


సోషల్ మీడియా వచ్చాక ప్రతీ విషయం ఆచి,తూచి మాట్లాడాల్సి వస్తోంది. మాట పెదవి దాటే లోగా, సోషల్ మీడియా దాన్ని ప్రంపచం మొత్తం చుట్టేస్తోంది. అలాగే గత కొద్ది రోజులుగా తెలుగు, హిందీ మీడియాలో అర్షద్ వార్శి ..ప్రబాస్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.  అర్ధద్ వార్శి కామెంట్స్ పై  ప్రభాస్ అభిమానులతో పాటు మన హీరోలు కొద్ది మంది మండిపడుతున్నారు.  ఆ క్రమంలో నాని సైతం మాట్లాడారు. అయితే అవీ వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో నాని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.  వివరాల్లోకి వెళితే... 

హిందీ నటుడు అర్షద్‌ వార్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కల్కి గురించి మాట్లాడారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని విచారం వ్యక్తంచేశారు. ‘‘ప్రభాస్‌.. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది. ఆయన లుక్‌ జోకర్‌లా ఉంది. మ్యాడ్‌ మ్యాక్స్‌ తరహా మూవీలో చూడాలనుకుంటున్నా. అక్కడ మెల్‌ గిబ్సన్‌లా నిన్ను చూడాలి. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. విమర్శలు చేయడంలో తప్పు లేదు కానీ.. నిర్మాణాత్మక విమర్శలు చేయడం మంచిదని.. ఇలాంటి కామెంట్స్‌ చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. 

ఇదిలాఉండగా,  తన నెక్ట్స్  సినిమా ప్రమోషన్స్‌ కోసం ముంబయికు వెళ్లిన నాని.. అర్షద్‌పై తన వ్యాఖ్యలను ఉద్దేశించి కీలకంగా మాట్లాడారు. ‘సరిపోదా శనివారం’ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నానిని ఈ విషయంపై స్పందించమని మీడియా వారు  కోరగా.. అర్షద్‌కు ఎన్నడూ రానంత ఫేమ్‌ ఈ కామెంట్స్‌తో వచ్చిందని చెప్పారు. నాని   చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. దాంతో నానిని నార్త్ బెల్ట్ లో చాలా మంది టార్గెట్ చేయటం మొదలెట్టారు. నాని ఆచి తూచి మాట్లాడాలని అన్నారు. అర్షద్ వర్శి ఏం తప్పు మాట్లాడారు అని అంతలా కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. ప్రభాస్ వంటి స్టార్ అలా కామెడీ గాకనపడటంతో బాధ కలిగి అర్షద్ వర్శి అన్నారని, దాన్ని ఇష్టం వచ్చినట్లు అందరూ కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. నాని కూడా ఇలా మాట్లాడటం పద్దతి కాదని సోషల్ మీడియా జనం భగ్గు మన్నారు. 

ఈ క్రమంలో అర్దద్ వర్శి  గురించి ఆ విధంగా కామెంట్‌ చేసినందుకు చింతిస్తున్నానని నాని   చెప్పారు. నాని మాట్లాడుతూ...‘‘అర్షద్‌ చాలా గొప్ప నటుడు. ‘మున్నాబాయ్‌’ నుంచి ఆయన అంటే మాకెంతో ఇష్టం. ఉత్తరాది లేదా దక్షిణాది అని కాదు భారతదేశం మొత్తం ఆయన్ని ఇష్టపడుతుంది. అందరికీ చేరువైన చిత్రమది. నటులుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. పదాల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల మేమిద్దరం బాధితులమయ్యాం’’ అని నాని అన్నారు.

అలాగే ‘‘ప్రభాస్‌ గురించి ఆయన చేసిన కామెంట్స్‌ నేనూ విన్నా. అర్షద్‌ని ఉద్దేశించి నేను చేసిన కామెంట్స్‌ ఏవిధంగా వైరల్‌గా మారాయో అదేవిధంగా ఆయన కామెంట్స్‌ కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మనం ఎంతో ఇష్టపడే వారి గురించి ఇలాంటి టాపిక్‌ ఏదైనా వస్తే.. ‘‘అనవసరమైన విషయానికి మనం ఎందుకు అంత ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని సహజంగానే అంటాం. ఆ విధంగానే నేనూ అన్నా. నా వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్స్‌ చూసిన తర్వాత అర్షద్‌ ఫుల్‌ ఇంటర్వ్యూ చూశా. మీడియా, సోషల్‌మీడియా తప్పుదోవ పట్టించిందని అర్థమైంది. అదేవిధంగా నా వ్యాఖ్యలు కూడా మరోవిధంగా ప్రజల్లోకి వెళ్లాయి’’ అని  చెప్పుకొచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios