Asianet News TeluguAsianet News Telugu

నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ: నాని సెటైర్

 ‘నేను నానికి చాలా పెద్ద పెద్ద అభిమానిని.. కానీ సెప్టెంబర్ 10న నా సినిమానే బెస్ట్‌గా ఉంటుంది అనే నమ్మకం నాకు ఉంది’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై నాని కూడా ఫన్నీగానే స్పందించారు. 

Nani reacts Rahul Ramakrishna tweet
Author
Hyderabad, First Published Sep 6, 2021, 8:07 AM IST

పోటీ అనేది ఎప్పుడూ ఉండాల్సిందే. అయితే ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ విషయం హీరో నానికి స్పష్టంగా తెలుసు. ఆ విషయం నాని మాట్లాడిన ప్రతీ సారి అందరికీ అర్దమవుతూనే ఉంది. మొన్నటికి మొన్న పెద్ద వివాదం అయినా ఆచి తూచి మాట్లాడారు. ఆవేదన వ్యక్తం చేసాడే కానీ ఆవేశపడిపోలేదు. ఇప్పుడు తనతో పోటీపడుతున్న రాహుల్ రామకృష్ణ విషయంలోనూ అదే చేసి శభాష్ అనిపించుకున్నాడు.

మరి కొద్ది రోజుల్లో ఓటీటీలో విడుదల కాబోతున్న నాని  సినిమా ‘టక్ జగదీష్’. నాని హీరోగా.. రితు వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.  ఈ వినాయక చవితి కానుకగా.. ఓటీటీలో విడుదల చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  అదే రోజున కమిడియన్  రాహుల్ రామకృష్ణ నటించిన ‘నెట్’ అనే సినిమా కూడా వినాయక చవితి కానుకగా విడుదల అవుతోంది.

 దీంతో హీరో నానిని ట్యాగ్ చేస్తూ.. ‘నేను నానికి చాలా పెద్ద పెద్ద అభిమానిని.. కానీ సెప్టెంబర్ 10న నా సినిమానే బెస్ట్‌గా ఉంటుంది అనే నమ్మకం నాకు ఉంది’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై నాని కూడా ఫన్నీగానే స్పందించారు. ‘జాతిరత్నాలు’ సినిమాలో రాహుల్ చెప్పిన ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే.. నేను ఎల్లిపోతా ఈడికెంచి’ అంటూ ట్వీట్ చేసిన నాని.. ‘నెట్‌’ని సినిమాను కూడా వీక్షించాలి అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ అభిమానులతో నవ్వులు పూయిస్తోంది. ‘రెండు సినిమాలు చూస్తాము అన్న’ అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/NameisNani/status/1434406885411614732
  
ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించిన రాహుల్ రామకృష్ణకు "జాతి రత్నాలు" సినిమా మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఈ గుర్తింపుతోనే రాహుల్ రామకృష్ణ హీరోగా అవికా గోర్ హీరోయిన్ గా భార్ఘవ్ మాచర్ల దర్శకత్వంలో వస్తున్నటువంటి వెబ్ మూవీ "నెట్".  ఈ క్రమంలోనే రాహుల్ రామకృష్ణ ఈ సినిమా ప్రమోషన్ లో పెద్ద ఎత్తున పాల్గొంటూ వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు.ఇతని ట్వీట్స్ పై వచ్చే విమర్శలకు సమాధానంగా ఇక్కడ అందరూ పత్తిత్తులు అంటూ సెటైర్లు వేశారు. 

ఈ క్రమంలోనే కష్టపడి పనిచేసే సిబ్బంది, అంకితభావంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, కమర్షియల్ సినిమాల మాదిరిగా కాకుండా కథ చెప్పే దైర్యం మా సినిమాకు ఉంది మాకు మద్దతివ్వండి అంటూ ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios