`గ్యాంగ్‌లీడర్‌` బాకీ తీర్చుకునేందుకు కలుస్తున్న నాని, ప్రియాంక.. ముహూర్తం ఫిక్స్..

నాని, వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో `అంటే సుందరానికి` చిత్రం వచ్చింది. అలాగే నాని, ప్రియంక మోషన్‌ జంటగా `గ్యాంగ్‌ లీడర్‌` వచ్చింది. ఈ రెండు డిజప్పాయింట్‌ చేశాయి. తాజాగా వీరంతా ఆ బాకీ తీర్చుకునే పనిలో పడ్డారు.

nani priyanka mohan pair after gang leader arj

నేచురల్‌ స్టార్‌ నాని.. `దసరా` చిత్రం తర్వాత ఇమేజ్‌ పరంగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాడు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అనంతరం ఆయన చేసే సినిమాలు అదే రేంజ్‌లో ఉంటున్నాయి. భారీ స్కేల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నాని `హాయ్‌ నాన్న` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో రాబోతుంది. ఆ తర్వాత వివేక్‌ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నారు. `నాని31` గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. 

ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్‌ వివరాలను ప్రకటిస్తుంది. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రంలో నానికి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుంది. ఈ ఇద్దరు గతంలో `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రంలో నటించారు. సినిమా పోయినా, ఈ జంటకి మంచి పేరొచ్చింది. కూల్‌ పెయిర్‌గా పిలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈ జంట వెండితెరపై మెరవబోతుంది. వివేక్‌ ఆత్రేయ చిత్రంలో జోడీ కడుతున్నారు. 

వీరిద్దరితోపాటు కీలక పాత్రలో దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు. సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు పూర్తి డిటెయిల్స్ ఇచ్చి, మంగళవారం సినిమాని ప్రారంభించబోతున్నారు. ఎల్లుండి ముహూర్తం ఫిక్స్ చేశారు. థ్రిల్‌ అయ్యే ఎలిమెంట్లు, చిల్‌ అయ్యేలా, ఫన్‌తో ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. 

వివేక్‌ ఆత్రేయతో నాని.. `అంటే సుందరానికి` చిత్రంలో నటించారు. ఈమూవీ సక్సెస్‌ కాలేదు. దీంతో మరోసారి కలిసి వర్క్ చేస్తున్నారు. ఫెయిల్యూర్‌ బాకీ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి ముహూర్తం స్టార్ట్ చేసి, త్వరలోనే షూటింగ్‌ జరుపబోతున్నారట. `హాయ్‌ నాన్న` చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు వివేక్‌ మూవీపై ఫోకస్‌ పెడుతున్నారు నాని. 

ఇక శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న `హాయ్‌ నాన్న` చిత్రం కూతురు సెంటిమెంట్‌, లవ్‌ ఎమోషనల్‌ జర్నీగా ఉండబోతుందట. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, శృతి హాసన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 7న విడుదల కాబోతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios