నేచురల్ స్టార్ నాని తన పెర్ఫార్మన్స్ తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. గతేడాది 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి కమర్షియల్ సినిమాల్లో నటించిన నాని ఇప్పుడు 'జెర్సీ' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్నాడు.

ఇందులో నాని మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం నాని చాలా కష్టపడుతున్నాడట. ఇటీవల షూటింగ్ లో నానికి గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా క్రికెట్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన నాని రన్ అవుట్ కాకుండా పరిగెడుతూ ఉండాలి..

ఆ సమయంలో నాని కింద పడిపోవడంతో అతి ముక్కుకి గాయమైందట. ముక్కు నుండి రక్తం రావడంతో హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. డాక్టర్లు పరీక్షలు మొత్తం చేసి సీరియస్ అవ్వాల్సిందేమీ లేదని చెప్పడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది.

ఇప్పుడు ఎప్పటిలానే షూటింగ్ కి హాజరవుతున్నాడట మన నేచురల్ స్టార్. అతడికి తగిలిన గాయాన్ని మేకప్ తో కవర్ చేస్తున్నారట. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.