జెర్సీ సినిమాతో సక్సెస్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని నెక్స్ట్ గ్యాంగ్ లిడర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాని ఈ మధ్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఒక క్రేజీ సినిమా సీక్వెల్ లో నాని నటించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చిన్న బడ్జెట్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. అయితే దర్శకుడు స్వరూప్ ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ని సెట్ చేస్తున్నాడు. 

అయితే కొన్ని పాయింట్స్ ను ఇటీవల నాని ముందు ప్రస్తావించగా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ తో మారోసారి నానిని కలిసి మెప్పించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.మరి ఆ సినిమాలో నాని గెటప్ ఎలా ఉంటుందో చూడాలి. గ్యాంగ్ లీడర్ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.