అదిరిపోయిన నాని కొత్త సినిమా `సరిపోదా శనివారం` కాన్సెప్ట్ టీజర్.. వివేక్ ఆత్రేయలో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలే
`దసరా` తర్వాత మరోసారి నానిని తనలోని ఊర మాస్ యాంగిల్ చూపిస్తున్నారు. వివేక్ ఆత్రేయతో కలిసి `సరిపోదా శనివారం` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేసింది టీమ్.

నేచురల్ స్టార్ నాని.. మరోసారి వివేక్ ఆత్రేయతో కలిసి సినిమా చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే `అంటే సుందరానికి` చిత్రం వచ్చింది. అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు హిట్ కోసం కలిశారు. అయితే ఈ సారి ఊహించని జోనర్‌తో వస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో మేళవించిన మూవీతో వస్తున్నారు. `దసరా` తర్వాత మరోసారి నానిని తనలోని ఊర మాస్ యాంగిల్ చూపిస్తున్నారు. వివేక్ ఆత్రేయతో కలిసి `సరిపోదా శనివారం` (Saripodhaa Sanivaaram) అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేసింది టీమ్. ఇందులో సంకెళ్లతో ఓ రూమ్‌లో బంధించి ఉన్నారు నాని. సాయికుమార్ వాయిస్ ఓవర్‌లో.. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలని పెద్దవాళ్లు చెప్పేవారు, కానీ ఇప్పటి తరం దాన్ని మార్చి నీ కంటూ ఓ టైమొస్తుందిరా, అందాక మూసుకుని వెయిట్ చేయు.. అని చెబుతున్నారు.ఇప్పుడిది ఆ మాట చెప్పిన ఆ తరం వాళ్ల గురించో, ఆ మాట మార్చిన ఈ తరం వాళ్ల గురించో కాదు, అప్పట్నుంచి ఇప్పటి వరకు ఏ తరం వారైనా, కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే ఆ ఒక్క రోజు గురించి.
అలాంటి రోజు, ఆ ఒక్క రోజు, ఒకడికి వారికి ఒక్కసారి వస్తే, వాడిని ఎవరైనా ఆపాలనుకోగలరా?.. అనుకున్నా ఆపగలరా? శనివారం, ప్రతి శనివారం..సరిపోదంటారా? అని సాయి కుమార్ చెప్పగా, తన కట్లు తెంచుకుని, సంకెళ్లని పగలగొట్టుకుని ఓ వైపు వర్షం, మరోవైపు మంటల మధ్యలో నుంచి కట్టలు తెచ్చుకుని, డోర్లు పగలగొట్టుకుని బయటకు వచ్చాడు నాని. ఆయన కోసం ఊరి జనం మొత్తం వెయిట్ చేయడం, ఆయన్ని చూసి ఓ చిన్నారి పాప నవ్వడం ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పించడంతోపాటు ఆకట్టుకుంటుంది.
లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ నుంచి ఇలాంటి జోనర్‌ని సినిమాని ఊహించడం కష్టం. మరి తనలోని కొత్త యాంగిల్‌ని ఆవిష్కరిస్తూ నానితో `సరిపోదా శనివారం` సినిమాని తెరకెక్కిస్తున్నారు వివేక్ ఆత్రేయ. విడుదల చేసిన టైటిల్, కాన్సెప్ట్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీన్ని పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ శనివారం నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం.