ద‌స‌రా త‌ర్వాత డెబ్యూడెంట్ డైరెక్ట‌ర్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేస్తోన్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్  శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.  


రిలీజ్ డేట్ అనేది సినిమా వాళ్లకు అతి ముఖ్యమైన అంశం. తమ సినిమాను సరైన డేట్ కు రిలీజ్ చేయాలని, శెలవలు ఉండేలా చూసుకోవాలని అందరూ ఆశిస్తారు. చిన్న సినిమాలకు ఎలాగో ఆ అవకాసం దొరకదు. కానీ పెద్ద సినిమాలు ఆచి,తూచి అడుగులు వేస్తారు. ఏనుగు వస్తోందంటే అందరూ ప్రక్కకు తప్పుకుని చోటు ఇస్తారు. అలాగే పెద్ద సినిమా వస్తోందంటే అడ్డం వెళ్లరు...దాని ప్రభావం తమపై పడి కొట్టుకుపోకూడదని చూసుకుంటారు. అలాగే నాని కూడా ఆలోచిస్తున్నట్లు ఉంది. తన #Nani30 సినిమా రిలీజ్ డేట్ విషయంలో లెక్కలు వేస్తున్నారని సమాచారం.

ఆ లెక్కలు ఏమిటంటే పవన్ కల్యాణ్ తాజా చిత్రం #OG క్రిస్మస్ కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే ... డిసెంబర్ ఫస్ట్ వీక్ లో #Nani30 విడుదల అవుతుంది. అలా కాకుండా... #OG డిసెంబర్ మొదట్లో ప్లాన్ చేస్తే #Nani30 అనుకున్న విధంగానే క్రిస్మస్ రిలీజ్...చేస్తారు. పవన్ కల్యాణ్ , ఆయన టీమ్ ఏమి డిసైడ్ చేస్తారనే దానిపై ...నాని #Nani30 టీమ్ తమ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యే అవకాసం ఉంది. ఈ క్రమంలో పవన్ నుంచి క్లారిటీ కోసం #OG వెయిటింగ్... అని చెప్తున్నారు.

ఇక ద‌స‌రా (Dasara) సినిమాతో ఫ్లాఫ్ ల్లో ఉన్న నాని స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. గ‌త నాలుగైదేళ్లుగా స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం ఎదురుచూస్తోన్న నాని ఈ సినిమాతో కెరీర్‌లో మ‌ర్చిపోలేని సక్సెస్ ని అందుకున్నాడు. మార్చి 30న థియేట‌ర్ల‌లో రిలీజైన ద‌స‌రా మూవీ వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. ఈ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన తెలుగు సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ స‌క్సెస్‌తో నాని త‌దుప‌రి సినిమాపై ఒక్క‌సారిగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ద‌స‌రా త‌ర్వాత డెబ్యూడెంట్ డైరెక్ట‌ర్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ఓ సినిమా చేస్తోన్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 21న ఈ సినిమా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసారు. . నాని హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది.