అఖిల్ తో పోటీ పడుతూనే లేదని లాజిక్ చెప్తున్న నాని

nani logic to avoid gap with akhil akkineni
Highlights

  • అఖిల్ హలో సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది
  • నాని ఎంసిఎ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదలకు ప్లాన్
  • రెండు సినిమాలు పోటీ పడుతున్న నేపథ్యంలో నాని ట్వీట్

 

దిల్ రాజు నిర్మాతగా, నాని హీరోగా నటిస్తున్న 'ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రం డిసెంబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు బేనర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నాని సినిమా విడుదలైన మరుసటి రోజు డిసెంబర్ 22న అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హలో' మూవీ విడుదలవ్వబోతోంది. ఈ నేపథ్యంలో నాని, అఖిల్ మధ్య బాక్సాఫీస్ వార్ అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

 

వార్ అఖిల్‌తో కాదని సల్మాన్‌ ఖాన్‌తో అని నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘టైగర్‌ జిందా హై' చిత్రం కూడా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘యుద్ధం నాకు అఖిల్‌కి మధ్య కాదు.. సల్మాన్‌ ఖాన్‌తో. ఈ క్రిస్మస్‌కు ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'.. ‘టైగర్‌'కు ‘హలో' చెబుతాడు. అది తెలుగు సినిమాపవర్‌ అంటూ నాని ట్వీట్‌ చేశారు.

 

అఖిల్‌తో నానికి మంచి స్నేహం ఉంది. తమ మధ్య ఏదో యుద్ద వాతావరణం నెలకొన్నట్లు వార్తలు రావడం ఇష్టం లేకనే నాని ఇలా స్పందించినట్లు తెలుస్తోంది. ఏ కారణం చేతనూ తమ మధ్య ఎలాంటి విబేధాలు రాకూడదని నాని ఇలా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

 

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా `ఎం.సి.ఎ`. దిల్‌రాజు `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌ నిర్మాత‌లుగా ఈ సినిమా రూపొందుతోంది.సినిమాను డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

 

అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ‘హలో'. దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది.డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. పిఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ. అన్న పూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టెన్మెంట్స్ సమర్పనలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

loader