దేవదాస్ సినిమా తరువాత నాని నటిస్తోన్న చిత్రం జెర్సీ. స్పోర్ట్స్ బేసిటీ డ్రామా గా రానున్న ఈ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ గా కనిపించనున్నాడు. రెండు డిఫరెంట్ షేడ్స్ లో నాని పాత్ర అలరిస్తుందని సమాచారం. ఇకపోతే ఇటీవల సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలెట్టిన నాని సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశాడు. 

2019 ఏప్రిల్ 19న భారీ స్థాయిలో రిలీజ్ కానున్నట్లు చెబుతూ సమ్మర్ లో జెర్సీ తప్పకుండా అలరిస్తుందని నాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అదే విధంగా ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ రావా సినిమాతో ఓ వర్గం వారిని బాగా ఆకర్షించిన గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇక సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ నానికి జోడిగా నటిస్తుండగా యువ సంచలనం అనిరుద్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందించనున్నాడు. పిడివి సమర్పణలో సీతారా బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు.