రోజు రోజుకీ తన సత్తా ని స్దాయిని పెంచుకుంటూ భాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ అవుతున్న హీరో నాని. న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకన్న నాని రీసెంట్ గా జెర్శీతో మరో మెట్టు ఎక్కారు. ఆయన నటనకు అంతటా మంచి మార్కులు పడ్డాయి. కలెక్షన్స్ వైజ్ గా కూడా సినిమా బాగానే వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఆయన ఆ ఎమోషనల్ మూడ్ ని తన అభిమానులను బయిటపడేయదలుచుకన్నారు. ఓ క్రైమ్ కామెడీతో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. 

జెర్శీ చిత్రం తర్వాత నాని చేస్తున్న చిత్రం  ‘గ్యాంగ్‌ లీడర్‌’. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని రైటర్ గా కనిపించనున్నారు. కొన్ని పరిస్దితుల్లో ఆయన ఓ గ్యాంగ్  ని లీడ్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్యాంగ్ లో ఎనిమిదేళ్ల ఓ పాప, పదిహేడేళ్ల అమ్మాయి, ఇరవై రెండేళ్ల పడుచు, యాభై ఏళ్ల అమ్మ, ఎనభైకి దగ్గర్లో ఉన్న ఓ బామ్మ... ఇలా అయిదుగురున్నారు. 

ఈ గ్యాంగ్ అందరితో కలిసి  కొన్ని చిన్న చిన్నదొంగతనాలు కూడా నాని చేస్తాడు. వాటి నుంచి కొంత ఫన్ జనరేట్ అవుతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ గా రూపొందే ఈ చిత్రం లో స్క్రీన్ ప్లే హైలెట్ గా ఉంటుందంటున్నారు. ఆర్ ఎక్స్ 100 కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. 

మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రీసెంగ్  సెట్స్‌పైకి వెళ్లింది.  . ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కార్తికేయ, ప్రియాంక, అనీష్‌ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, సత్య తదితరులు నటిస్తున్నారు.  

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి