హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా దూసుకుపోతున్న యంగ్ హీరో నాని. కరోనా టైమ్ లోనూ ఓటీటిలో  ‘వి’ సినిమాతో మన ముందుకు వచ్చిన నాని... త్వరలో టక్ జగదీష్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  నిన్నుకోరిలాంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూండటంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో నాని సినిమాకు ఎంత తీసుకుంటున్నారనే విషయమై అంతటా టాపిక్ మారింది. అందులోనూ నాని ఈ మధ్యన రెమ్యునేషన్ పెంచేసాడని వినపడింది. అయితే నాని ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారు?   

న్యాచుర‌ల్ స్టార్ గా పిలుచుకునే నాని నిర్మాత వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి తో చేస్తోన్న శ్యామ్‌సింగ‌రాయ్ కోసం భారీ మొత్తంలోనే రెమ్యునరేష‌న్ తీసుకుంటున్నాడ‌ని టాక్ . ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల సమాచారం ప్ర‌కారం నాని ఈ చిత్రం కోసంన రూ.9 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇప్పుడు అదీదాటిపోయి పెంచేసాడంటున్నారు. డిజిటల్ రైట్స్ రూపంలోనూ నిర్మాతలకు మంచి మొత్తాలు వస్తున్న నేపధ్యంలో నాని తను రెమ్యునేషన్ పెంచటం సమంజసమే అంటున్నారట.

 ఈ సినిమాతోపాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘అంటే సుందరానికి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు నాని తన రెమ్యునరేషన్ కూడా పెంచేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు కనీసం పదిహేను కోట్లవరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. నాని సినిమా హిట్ అయితే ఖచ్చితంగా 40 కోట్ల వరకు కలెక్ట్ చేస్తాయి. అదే సమయంలో నాని సినిమాలకు బడ్జెట్ మాత్రం 20 కోట్లు దాటకపోవటం ప్లస్ అవుతుంది. అందుకే నాని వైపు హీరోలు మ్రొగ్గు చూపుతున్నారు.

 శ్యామ్ సింగరాయ్ విషయానికి వస్తే.... టాక్సీవాలా సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గ నటిస్తుందని తెలుస్తుంది.