బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్2 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. షో ఆరంభమైనప్పటి నుండి ఎన్టీఆర్ స్థాయిలో నాని అలరించలేకపోతున్నాడనే మాటలు వినిపిస్తున్నప్పటికీ తన బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు నాని. బిగ్ బాస్ హౌస్ నుండి మొదటి వారంలో ఎలిమినేట్ అయిన సంజనా ప్రస్తుతం టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీ అయిపోయింది.

ఇందులో భాగంగా నాని యాంకరింగ్ పై కామెంట్స్ చేసింది సంజనా. ఐఫోన్ వాడిన తరువాత నార్మల్ ఫోన్ వాడితే ఎలా ఉంటుందో ఎన్టీఆర్ యాంకరింగ్ చూసిన తరువాత నాని యాంకరింగ్ నాకు అలానే అనిపించింది అంటూ నానిని తక్కువ చేసి మాట్లాడింది. దీనికి స్పందించిన నాని.. ''సేమ్ పించ్.. నాకు కూడా ఐఫోన్ అంటేనే ఇష్టం'' అంటూ ట్వీట్ చేశాడు. నాని ట్వీట్ కు రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి.

ఒకటి ఎన్టీఆర్ యాంకరింగ్ తనకు కూడా నచ్చిందని, మరొకటి తను కూడా ఐఫోన్ లాంటి స్టఫ్ ఉన్న కంటెస్టంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోచూడాలనుకుంటున్నట్లు.. నాని వేసిన ఈ కౌంటర్ ను అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. రోజురోజుకి ఈ షోపై జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. నాని కూడా తనదైన స్టైల్ లో నేచురల్ జోక్స్, పంచ్ లు వేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు.