జెర్సీ సినిమాతో నాని విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా సినిమా అనుకున్నంతగా లాభాలని ఇవ్వలేకపోయింది. నాని గత రెండు సినిమాలు కృష్ణార్జున యుద్ధం - దేవా దాస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు ఎలాగైనా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని న్యాచురల్ స్టార్ ట్రై చేస్తున్నాడు. 

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాపై ఇప్పటివరకైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సినిమా పాటలు కూడా క్లిక్కయ్యాయి. ఇక సినిమాకి హైప్ పెరిగిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. నాని కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా యూఎస్ లో ఎప్పుడు లేని విధంగా 200 లోకేషన్స్ లలో నాని సినిమా సందడి చేయనుంది. నాని ఇప్పటికే ఆరు సార్లు యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ తో కుర్ర హీరో డబుల్ మిలియన్ ని అందుకుంటాడని టాక్. సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.