నేచురల్ స్టార్ నాని నటించిన తాజాగా చిత్రం ‘దసరా’ Dasara. ఈ చిత్రం నుంచి తాజాగా నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఊర మాస్ లుక్ లో నాని ఆకట్టుకుంటున్నాడు. ఫస్ట్ లుక్ మరో పుష్ప మాదిరిగా కనిపిస్తోంది. 

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singh Roy)తో మంచి విజయం సాధించాడు. అదే జోష్ లో వరుసగా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న నాని.. ప్రస్తుతం ‘దసరా’ Dasara షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా దసరా మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

తాజాగా, నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్పార్క్ ఆఫ్ దసరా అంటూ సాలిడ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఓ మైనింగ్ ఏరియాలో యాక్షన్ సీక్వెన్స్ షురూ చేసే ముందు నానిని చూపిస్తూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒంటినిండా మట్టితో నిండి ఉన్న నాని... లుంగిని పైకెత్తి కట్టి.. బనియన్, ఆపై రెడ్ చెక్స్ షర్ట్ ధరించాడు. షర్ట్ హ్యాండ్స్ మోచేతి వరకు మడిచి, మంటలోంచి ఏదో తీస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. చాలా కోపంగా.. ఎదుటి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలనేంత కసిగా ఉన్నాయి నాని చూపులు. బ్యాక్ గ్రౌండ్ లో నానితో కలిసి పనిచేసే తోటి కూలీలను చూడవచ్చు. మొత్తంగా ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు తెగనచ్చేస్తోంది. ‘ధరణి’ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

అదే విధంగా పలువురు నెట్టిజన్లు ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కు ఫిదా అవుతున్నారు. మరో పుష్పను తలపించేలా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. నాని ఆహార్యం, మేనరిజం మొత్తం పుష్పలోని అల్లుఅర్జున్ లాగే ఉన్నట్టు గా తెలుస్తోంది. ఏదేమైనా పుష్ప Pushpa తో బన్నీ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అదే బాటనెంచుకున్న నాని దసరాతో అదరగొట్టనున్నాడు. అలాగే నాని చివరి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’లోనూ హుందా తననాన్ని చూపించి మెప్పించాడు. ప్రస్తుతం ఊరమాస్ లుక్ లో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు నాని. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. నాని సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆడిపాడనుంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఆగస్టులోనే మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. నాని మరోచిత్రం ‘అంటే సుందరానికీ’ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాని సుందర్ ప్రసాద్ పాత్రలో నటిస్తున్నారు. నజ్రియా లీలా థామస్ పాత్రను పోషిస్తోంది.

Scroll to load tweet…