Asianet News TeluguAsianet News Telugu

నాని ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ.. 'శ్యామ్ సింగ రాయ్' రిలీజ్ డేట్

నాని హీరోగా.. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాక్ డ్రాప్‏లో రూపొందుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా..మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

nani first fan india movie shyam sigha roy release date fix
Author
Hyderabad, First Published Oct 18, 2021, 12:31 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, ఓటీటీలో విడుద‌ల చేసేందుకు భారీ  ఆఫర్స్ వచ్చాయి.  అవన్నీ ప్రక్కన పెట్టి థియోటర్ రిలీజ్ వైపు మ్రొగ్గు చూపారు నిర్మాతలు.  మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు. 

తాజాగా నేచురల్‌ స్టార్ Nani..  Shyam Singha Roy సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నాట్లుగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా నాని ప్రకటించాడు. నాని నటిస్తున్న సినిమా ఫస్ట్ టైమ్‌ Fan India లెవల్‌లో విడుదల కాబోతుండటం విశేషం. ఈ సందర్బంగా శ్యామ్ సింగరాయ్ నుంచి నాని, Sai Pallavi కలిసి ఉన్న ఫోటోను రివీల్ చేశారు.. . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఈ సినిమా కోసం పది ఎకరాలో సెట్స్ వేసి మేజర్ పార్టును అందులోనే చిత్రీకరించారు.  

also read: పవన్ ని కలిసిన ఇద్దరు క్రేజీ డైరెక్టర్లు ? ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్!
 
కాగా, ఈ సినిమాలో నాని రింగుల జుట్టు, కోర మీసాలలతో విభిన్నమైన లుక్‌లో కన‌ప‌డుతుండ‌డం ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయినపల్లి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాహుల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరన సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.   ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.  ఇటీవల వచ్చిన నాని 'టక్ జగదీష్' యావరేజ్ అనిపించుకుంది. మరి 'శ్యామ్ సింగ రాయ్' తో హిట్ కొడతాడేమో చూడాలి.

ఇక ఈ సినిమాలతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

also read: మంచు లక్ష్మీ దారుణంగా ట్రోలింగ్‌.. నెటిజన్లకి నటి దిమ్మతిరిగే కౌంటర్‌.. నెట్టింట వైరల్‌
 

Follow Us:
Download App:
  • android
  • ios