Asianet News TeluguAsianet News Telugu

ఎంసిఎ ప్రి రిలీజ్ కు వరంగల్ తరలొచ్చింది.. కానీ దిల్ రాజుకు కోపమొచ్చింది

  • నాని, సాయి పల్లవి జంటగా వస్తోన్న దిల్ రాజు సినిమా ఎం.సి.ఎ
  • ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ శనివారం వరంగల్ లో గ్రాండ్ గా జరిగింది
  • భారీగా జనం తరలి వచ్చిన ఈ ఈవెంట్ లో దిల్ రాజుకు కోపమొచ్చింది
  • నాని మాత్రం దిల్ రాజు మాటలు పట్టించుకోవద్దంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు
nani dilraju mca audio event in warangal between huge public

నాని, సాయి పల్లవి జంటగా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎంసీఏ - మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'. డిసెంబర్ 21న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కిన ఈచిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం వరంగల్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు వరంగల్ మొత్తం తరలి వచ్చిందా అన్నంత రేంజ్ లో అభిమానులు హాజరయ్యారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

 

ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి, దాస్యం వినయ భాస్కర్, ఎంపీ దయాకర్ సహా పలువులు స్థానిక నేతలు హాజరయ్యారు. కార్యక్రమంలో దిల్ రాజు ప్రసంగిస్తున్న సందర్భంలో.. అభిమానులు బాగా అల్లరి చేయడంతో దిల్ రాజు... ‘అరేయ్ ఏందిరా బై.. కొంచెం గమ్మునుండుర్రా...మనకు గిట్ల జెప్తేగని అర్థం కాదా?'... అన్నారు. అయినా ఫ్యాన్స్ అల్లరి ఆపకపోవడంతో... ‘ఏయ్ అర్థం కాదా? మాట్లాడనివ్వండి. మీరు ఇలా అల్లరి చేస్తే వరంగల్ లో ఫంక్షన్లు ఉండవు, షూటింగులు ఉండవు. సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగుల కోసం వరంగల్ వచ్చేలా ఉండాలి, మీరు ఇలా చేస్తే ఎలా? అని’ దిల్ రాజు వ్యాఖ్యానించారు.

 

అయితే దిల్ రాజు నుంచి మైక్ అందుకున్న నాని మాత్రం... ‘రాజు గారు అలాగే చెబుతారు. ఆయన్ను మీరు పట్టించుకోవద్దు. హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చి ఫంక్షన్ చేస్తుంది మీరు సైలెంటుగా ఉంటానికా? ఈ రోజు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్టు చూస్తుంటే... ప్రతీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయీ హీరో అయిపోయినంత ఆనందంగా ఉంది. ‘ఎంసీఏ' మొత్తం వరంగల్‌లోనే తీశాం. ఇంత దూరంగా వచ్చినా ఏనాడూ ఇంటిని మిస్‌ అయినట్టు అనిపించలేదు. మీరు అందరూ ఇచ్చిన సపోర్టుకు థాంక్స్. ఎన్ని జన్మలున్నా మీ రుణం తీర్చుకోలేను. దిల్‌రాజుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఈయేడాదితో ఒకే యేడు ఆయనతో రెండు సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఈ సినిమాతో సాయి పల్లవి నాకు ఫిదా అయిపోయిందట. నేను కూడా తనతో చేసిన సన్నివేశాల్ని ఆస్వాదించాను. వేణు కథ చెప్పినప్పుడు నాకు నేను కనిపించాను. సామాన్యులు కనిపించారు. వాళ్లకు నచ్చే సినిమా అవుతుంది' అన్నారు.

nani dilraju mca audio event in warangal between huge public

 

సాయి పల్లవి ‘‘దర్శకుడు వేణు కష్టపడి ఓ మంచి సినిమా తీశారు. భూమిక నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆమె ఇంకా సినిమాలు చేయాలి. నన్ను కూడా ఓ తెలుగు అమ్మాయిలా ఆదరిస్తున్నందుకు థాంక్స్. నాని చాలా హార్డ్ వర్కర్. ప్రతి సీన్ చేసే ముందు దాన్నిఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారు.'' అని సాయి పల్లవి అన్నారు.

 

‘‘ఎంసీఏ అంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, అమ్మాయి కాదు. మిడిల్‌ క్లాస్‌ ఆడియన్స్‌. మిడిల్‌ క్లాస్‌ అనేది స్థాయి కాదు. అదో మైండ్‌ సెట్‌. మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వాళ్లందరికీ ఈ సినిమా నచ్చుతుంది'' అని దర్శకుడు వేణు శ్రీరామ్ అన్నారు.

 

దిల్ రాజు మాట్లాడుతూ... శతమానం భవతి సినిమాలో పేరెంట్స్ గురించి చెప్పాం. ఫిదా సినిమాలో తండ్రీకూతుళ్ల గురించి చెప్పాం. ఈ ఎంసీఏ సినిమా అన్నా, వదినా, మరిది కథ. మళ్లీ సకుటుంబ సమేతంగా చూసే సినిమా. ఫస్టాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండాఫ్ లో అందరినీ టచ్ చేసే కథ ఉంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా వరుసగా 5 సినిమాలు సక్సెస్ కొట్టాం. ఇపుడు సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే  ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.... ‘నాకు దిల్ రాజు మీద కొపం ఉంది, శిరీష్-లక్ష్మణ్ లను కూడా ఒకసారి కొట్టాలి. ఎందుకంటే ‘ఫిదా' సినిమా ఇక్కడ తీస్తానని మాట ఇచ్చి మోసం చేశారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వెంటనే దిల్ రాజు అందుకుని మా జిల్లాల తీసుకోవద్దా? అందుకే అక్కడ తీశాం అన్నారు. దీంతో ఈ ఎం.సి.ఎ సినిమా అయినా వరంగల్ లో తీసినందుకు థాంక్స్. ఏ సినిమా అయినా ఇక నుండి దిల్ రాజు వరంగల్ నుండే మొదలు పెట్టాలని మనస్పూర్తిగా కోరుతున్నాను' అన్నారు.

nani dilraju mca audio event in warangal between huge public

 

Follow Us:
Download App:
  • android
  • ios