న్యాచురల్ స్టార్ నాని స్టార్ హీరోగానే కాకుండా మినిమం గ్యారెంటీ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. తన కెరీర్ లో పెద్ద హిట్స్ ఇచ్చి, మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న నాని మంచి గౌరవాన్నే కాక రెమ్యునేషన్ ని సైతం భారీగానే అందుకుంటున్నాడు. అయితే ఫిల్మ్ నగర్ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నాని తన రెమ్యునేషన్ తీసుకునే విధానం మార్చుకున్నాడట.

ఇప్పుడు ఆయన లాభాల్లో షేర్ డిమాండ్ చేస్తున్నారట. తన రెమ్యునేషన్ అడ్వాన్స్ మాత్రమే తీసుకుని, సినిమా రిలీజ్ ముందు జరిగే బిజినెస్ లో షేర్ తీసుకుంటాను అని చెప్తున్నారట. అది కూడా శాటిలైట్, డిజిటల్, థియోటర్ రైట్స్ వచ్చే మొత్తాలలో సొమ్ము అడుగుతన్నారట. ఆ విధంగా అయితే తన కష్టం కు తగిన ప్రతిఫలం ముడుతుందని భావిస్తున్నాడట.త ఇది నిర్మాతలకు కాస్త ఇబ్బంది పెట్టే వ్యవహారంగా మారుతోందట.

రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో షేర్ అడిగితే ఇబ్బంది లేదు కానీ..బిజినెస్ జరిగేటప్పుడు షేర్ అడిగితే..రేపు నష్టాలు వస్తే వెనక్కి డబ్బులు ఇఛ్చే టప్పుడు ఇబ్బందులు ఎదురౌతాయని ..ఈ డిమాండ్ కరెక్ట్ గా లేదని అంటున్నారట. అయితే హీరోగా అవన్నీ నాని ఆలోచించాల్సిన అవసరం లేదు. తన డిమాండ్ కు నచ్చి ముందుకు వచ్చిన వాళ్ళతోనే సినమా చేస్తానంటున్నాడట. నానితో సినిమా చేయటానికి చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్న నేపధ్యంలో ఆయన డిమాండ్ తీర్చి ముందుకు వెళ్లటం తప్ప వేరే దారి లేదు.