స్పీడ్ పెంచిన ‘దసరా’ టీం.. కొత్త పోస్టర్ విడుదల చేస్తూ క్రేజీ అప్డేట్ అందించారుగా!
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా క్రేజీ అప్డేట్ అందింది.
మునుపెన్నడూ లేనివిధంగా ‘దసరా’లో ఊరమాస్ అవతార్ లో అలరించబోతున్నారు నేచురల్ స్టార్ నాని. మరోవైపు నాని తొలి పాన్ ఇండియన్ సినిమాగానూ Dasara విడుదల కాబోతోంది. నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. మరోవైపు చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ శరవేగంగా కొనసాగిస్తోంది.
తాజాగా ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ ను అందించారు. చిత్రం నుంచి ఇప్పటికే ‘ధూమ్ ధాం దోస్తాన్’, ‘ఓరి వారి’ సాంగ్స్ విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మూడో సాంగ్ ను కూడా విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. మార్చి 8న ఈ ఫోక్ మెలోడీ సాంగ్ రానున్నట్టు అప్డేట్ అందించారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన రెండో సాంగ్ విడుదల చేసే సమయంలో నాని మీడియాతో సినిమా గురించి చాలా విషయాలను చెప్పిన విషయం తెలిసిందే. చిత్రం నుంచి జానపదా గేయాలను గుర్తు చేసేలా పాటలు వస్తుండటం విశేషం.
పాన్ ఇండియా చిత్రం కావడంతో.. నానినే దగ్గరుండి చిత్ర ప్రమోషన్స్ ను చూసుకుంటున్నారు. ఆయనే ప్రతిచోటా సినిమాపై ఆసక్తిని పెంచేలా చొరవ తీసుకుంటున్నారు. మార్చి 30న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
చిత్రం నుంచి ఇప్పటికే పోస్ర్లు, రెండు పాటలు , టీజర్ విడుదలై ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండంతో మరిన్ని అప్డేట్స్ ను అందిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. మరోవైపు నాని ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భావించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. గోదావరిఖిని సమీపంలోని వీర్లపలిలో ఉన్న గ్రామంలో జరిగే కథగా ‘దసరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని ఊరమాస్ లుక్, బొగ్గుగనుల్లో ఇమిడిపోయినట్టు కనిపించే ప్రవర్తన, కరీంనగర్ యాస, భాష, మాస్ లోకేషన్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.